నందమూరి బాలయ్య ఇప్పటి వరకు 104 సినిమాలు కంప్లీట్ చేసారు.  ఇప్పుడు తన 105 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు.  సీనియర్ దర్శకుడు కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోంది.  ఇందులో బాలయ్య కొత్తగా కనిపిస్తున్నారు. యంగ్ లుక్ లో అదరగొడుతున్నారు. నెక్స్ట్ బోయపాటితో సినిమా చేయబోతున్నారు.  ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి.  కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో గతంలో జయసింహ వచ్చింది.  ఈ మూవీ మంచి విజయం సాధించింది.  


ఇది సినిమాకు ప్లస్ కావడంతో మరలా అదే కాంబినేషన్ ను సెట్ చేసుకున్నారు బాలయ్య.  ఇక బాలయ్య కెరీర్లో ది బెస్ట్ హిట్ సినిమాగా చేసుకునే వాటిల్లో భైరవద్వీపం సినిమా ఒకటి.  అందులో బాలయ్య నటన అద్భుతం.  యోధుడిగా బాలయ్య చేసిన సాహసాలు అమోఘం.  బాలయ్యను చాలా ఎనేర్జిటిక్ గా ఈ సినిమాలో నటించారు.  సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ ప్రయోగాత్మక సినిమా బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపించింది.  


అంతకు ముందు సామజిక, కమర్షియల్ చిత్రాల్లో ఎక్కువా నటించిన బాలయ్య ఇలాంటి పౌరాణికగాధతో కూడిన సినిమా చేయడం విశేషం.ఇక ఇందులో బాలయ్య పాత్ర ఒకటి కురూపిగా ఉంటుంది.  మోహించి వచ్చిన యువతిని కాదన్నందుకు రంభ శాపం పెడుతుంది.  దీంతో బాలయ్య కురూపిగా మారిపోతాడు.  పెళ్లి చేసుకోబోతున్న యువతిని మాంత్రికుడు మాయం చేస్తాడు.  దీంతో బాలయ్య ఆ మాంత్రికుడిని ఎలా సంహరించాడు అన్నది కథ.  


అయితే, యంగ్ గా, మాస్ హీరోగా అదరగొడుతున్న సమయంలో సినిమాలో కురూపిగా కనిపించడం అన్నది పెద్ద సాహసం.  అభిమానులు బాలయ్యను మొదటిసారి అలా చూసి షాక్ అయ్యారు.  బాప్ రే బాలయ్య ఏంటిది ఇది ఆశ్చర్యపోయారు.  బాలకృష్ణమాత్రం సినిమాలో స్టోరీని బట్టి క్యారెక్టర్ చేసేస్తుంటారు.  అందుకే బాలయ్యతో సినిమాలు చేయడానికి చాలామంది దర్శకులు ఆసక్తి చూపుతుంటారు.  ఇప్పుడు బోయపాటి సినిమాల్లో కూడా బాలయ్య అదే విధంగా కనిపిస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: