రాబోతున్న 2014 సంవత్సరం దేశరాజకీయాలలో పెను మార్పులు తేబోతోంది. అదేవిధంగా రాబోతున్న 2014 జనవరి మెగా అభిమానులకు మెగా నెలగా మారబోతోంది అంటు ఫిలింనగర్ లో సెటైర్లు పడుతున్నాయి. దీనికి కారణం మెగా కుటుంబానికి చెందిన మెగా హీరోల సినిమాలకు సంబంధించిన ప్రధాన సంఘటనలు ఈనెలలో జరగబోతున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్-2’ సినిమా పూజా కార్యక్రమం ఈనెల 28న జరిగినా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మాత్రం వచ్చే జనవరి నుండి రెగ్యులర్ గా జరగబోతోంది.  అదేవిధంగా ఇప్పటివరకు రకరకాల కారణాలతో విడుదలకు నోచుకోని ‘ఎవడు’ వచ్చేనెల సంక్రాంతి రేసులో మహేష్ తో పోటీ పడుతోంది. అంతేకాదు ‘తుఫాను’ విడుదల తరువాత కెమెరాకు దూరంగా ఉన్న చరణ్ మళ్ళీ మేకప్ వేసుకుని జనవరి 16 నుండి బిజీ అవుతున్నాడు. స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ కూడా తన ‘రేసుగుర్రం’ నుండి దిగివచ్చి త్రివిక్రమ్ తో జత గట్టబోతున్న సినిమా షూటింగ్ కూడా జనవరి నెలాఖరు నుండే అని అంటున్నారు.  ఇప్పటికే టాలీవుడ్ ను శాసిస్తున్న మెగా కుటుంబ హీరోల సంఖ్యలోకి మరో కొత్త ఎడిషన్ గా చేరబోతున్న నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ టాలీవుడ్ ఎంట్రీ వచ్చే సంవత్సరం జనవరి 1వ తారీఖున జరుగబోతోంది. ఇలా రాబోతున్న జనవరి అంతా టాలీవుడ్ లో మెగా కుటుంబ సినిమాల హడావిడితోనే జరగబోతోంది కాబట్టి రాబోతున్న జనవరిని మెగా అభిమానులు మెగా నెలగా పిలుచుకున్నా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు టాలీవుడ్ విశ్లేషకులు.  

మరింత సమాచారం తెలుసుకోండి: