గత రెండు రోజులుగా తెలుగు సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు అంటు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలలో నిజం ఎంతో తెలియక పోయినా ఈ మధ్య ఆయన్ను చూసిన వారంతా ఇలాంటి అనుమానమే వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం 70 సంవత్సరాల వయసున్న ఆయన ఇటీవల తన అల్లుడు సుధీర్ బాబు నటించిన ‘ఆడు మగాడ్రా బుజ్జి' ప్రీమియర్‌షోకు హాజరైన సందర్భంగా చుసిన ఆయన సన్నిహితులు ఆ సందర్భంలో ఆయన కాస్త బలహీనంగా కనిపించడంతో ఫిల్మ్ నగర్లో అప్పటి నుంచి ఈ వార్తలు చర్చకు వస్తున్నాయి . సినిమాల్లో యాక్టివ్‌గా నటించక లేక పోయినా ఆయనకు అప్పుడప్పుడు వస్తున్న పెద్ద సినిమాలలో అవకాశాలను తిరస్కరించడంతో పాటు ఈమధ్య వెంకటేష్, రామ్ చరణ్ ల మల్టీ స్టారర్ సినిమా కోసం కృష్ణవంశీ ఎన్నివిధాల ప్రయత్నించినా చివరకు కృష్ణ ఆ పాత్రకు నో చెప్పడం దగ్గర నుంచి ఈ వార్తలు మరింత పెరిగిపోయాయి. ఇటువంటి పరిస్థుతులలో రకరకాల రూమర్స్ కృష్ణ ఆరోగ్యం పై రావడం కృష్ణ మరియు మహేష్ అభిమానులను ఖంగారు పెడుతోంది. ఈ పరిస్థుతులలో వచ్చే వరం 19వ తారీఖునాడు జరగబోతున్నమహేష్ ‘1’ ఆడియో వేడుకకు కృష్ణ హాజరావుతాడా లేదా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.  ఈ పరిస్థుతుల నేపధ్యంలో వచ్చే వారం ‘వన్' సినిమా ఆడియో వేడుకకు ఎప్పటి లాగే కృష్ణ ఆరోగ్యంగా వచ్చి మహేష్ అభిమానులకు జోష్ కలిగించాలని అందరు కోరుకుంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: