కుటుంబ కథా చిత్రాలలో తీయడంలో తనకు తానే సాటి అనిపించుకున్న డైరక్టర్ యస్.వి.కృష్ణారెడ్డి. ఆయన తీసిన శుభలఘ్నం, మావిచిగురు లాంటి సినిమాలు ఇంట్లో సీరియల్స్ చూస్తున్న ఫ్యామిలీ లేడీస్ ని థియేటర్ బాట పట్టేలా చేసాయి.ఇక తనే కథానాయకుడిగా తీసిన ఉగాది, ఆభిషేకం సినిమాలు కూడా మంచి టేస్ట్ ని ఆడియెన్స్ కి అందించాయి. ఇక కామెడీ యాక్టర్ అయిన ఆలి హీరోగా తీసిన యమలీల మాత్రం సూపర్ హిట్ సాదించింది. అప్పట్లో ఇది ఒక ప్రయోగం లా చేసిన యస్.వి. కృష్ణా రెడ్డి ఆ సినిమా విజయంవంతం అవ్వడంలో హండ్రెడ్ పర్సెంట్ కృషి చేసారు. ఆ తర్వాత చాలా సినిమాలు తీసి మంచి డైరక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈయన ఇప్పుడు తను తీసిన యమలీల సినిమాను మళ్లీ ఇప్పటి పరిస్థులకు అనుగుణంగా మార్చి రీమేక్ చేయాలనుకుంటున్నాడట.సో అదే జరిగితే ఈ సారి ఆలి ని హీరోగా పెట్టడానికి చాన్స్ లేదు కాబట్టి ఎవరిని హీరోగా పెడతారో అని ఆడియెన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడున్న కామెడీ హీరోలలో ఆ క్యారక్టర్ కి ఎవరైతే సరిగ్గా సరిపోతారో వారినే హీరోగా పెట్టే అవకాశం ఉందని అనుకుంటున్నారు ఫిల్మ్ నగర్ వర్గాలు. ఇంకా లోతుగా వెళ్తే ఈ సినిమాకి హీరోగా అల్లరి నరేష్ లేదా సునీల్ అయినా చేసే అవకాశం ఉండొచ్చు అని గుసగుసలు వినిపిస్తున్నాయి.ఇందులో ఇంకో విషయం ఏంటంటే యమలీల లో యమధర్మ రాజుగా చేసిన కై కాల సత్యనారాయానకు బదులు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ను పెట్టే అవకాశాం ఉందని ఫిల్మ్ నగర్ సమాచారం. ఏది ఏమైనా ఒక మంచి ప్రోజెక్ట్ గా కృష్ణా రెడ్డి గారి నుండి రాబోతున్న ఈ సినిమా గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోవాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: