బాలీవుడ్‌లో 2013 వెండితెర మీద కాసులు వర్షం కురిసింది. హిట్‌ ప్లాప్‌ అన్న తేడా లేకుండా.. పదికి పైగా సినిమాలు వంద కోట్ల మార్క్‌ను అవలీలగా దాటేశాయి. టాక్‌తో నిమిత్తం లేకుండా బాలీవుడ్‌లో కాసుల పంటపండించిన కమర్షియల్‌ సక్సెస్‌లపై స్పెషల్‌ రివ్యూ చూద్దాం.వందకోట్లు… అక్షరాలా వందకోట్లు.. బాలీవుడ్‌లో ఒకప్పుడు ప్రెస్టీజియస్‌గా మారిన ఈ కలెక్షన్‌ మార్క్‌ ఇ్పపుడు కామనైపోయింది.. హై బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సినిమాలతో ఇండియన్‌ సినిమా కలెక్షన్‌ స్టామినా ఎంటో ప్రూవ్‌ చేశారు. వందకోట్ల క్లబ్‌లో ముందుగా చెప్పుకోవాల్సిన హీరో షారూఖ్‌ ఖాన్‌.. చాలా రోజులుగా తన స్థాయి హిట్‌ ఇవ్వటంలో వెనకపడుతున్న కింగ్‌ఖాన్‌ ఈ ఏడాది సత్తా చాటాడు.. దీపిక పదుకునే జంటగా తెరకెక్కిన చెన్నైఎక్స్‌ప్రెస్‌ సినిమాతో మరోసారి తాను బాలీవుడ్‌ బాద్‌షా కోట్ల కలెక్షన్లను సాధించి తాను ఎప్పుడూ రేసులో ఉంటానని ప్రూవ్‌ చేసుకున్నాడు. ఈ లిస్ట్‌లో చెప్పుకోవాల్సిన మరో హీరో హృతిక్‌.. ఇండియన్‌ సూపర్‌ హీరోగా క్రిష్‌ సీరీస్‌తో సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తున్న ఈ హ్యండ్సమ్‌ హంక్‌ మరోసారి క్రిష్‌గా ఆకట్టుకున్నాడు. గత సినిమాలతో పోలిస్తే భారీ బడ్జెట్‌తో భారీ స్టార్‌ కాస్ట్‌తో తెరకెక్కిన క్రిష్‌ 3 తో ఇండియన్‌ సినిమాను ఇంటర్‌నేషనల్‌ లెవల్‌కి తీసుకెళ్లాడు. క్రిష్‌-3 తో హృతిక్‌ 500 కోట్లు మార్క్‌కు చేరువయ్యాడు. మరో బాలీవుడ్‌ ఖాన్‌ సాబ్‌, సైఫ్‌ కూడా బాక్సాఫీస్‌ దగ్గర సత్తా చాటాడు. రేస్‌కు సీక్వల్‌గా వచ్చిన రేస్‌ 2 సినిమాతో సైఫ్‌ వందకోట్ల క్లబ్‌లో చేరాడు. భారీ కమర్షియల్‌ చిత్రాలు మాత్రమే కాదు, ప్రయోగాత్మక చిత్రాలకు కూడా ఈ ఏడాది కాసుల పంట పండింది. బాగ్‌మిల్కా బాగ్.. ప్రముఖ క్రీడాకారుడు మిల్కాసింగ్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టించింది. సౌత్ హీరో ధనుష్ హీరోగా సోనం కపూర్ హీరోయిన్ గా వచ్చిన సినిమా రాంజానా.. లవ్ స్టోరీనే డిఫరెంట్ యాంగిల్ లో చూపించిన ఈ సినిమా లో ధనుష్ యాక్టింగ్ సూపర్ అనిపించుకుంది. అంతేకాదు మొదటి సినిమాతోనే 100 కోట్ల క్లబ్ లో చేరి సరికొత్త రికార్డ్ ని సొంతం చేసుకున్నాడు. ఇదే బాటలో ప్రయోగాత్మకంగా తెరకెక్కి మంచి విజయం సాదించిన సినిమా స్పెషల్‌ చబ్బీస్‌. పీరియాడిక్‌ స్టోరిగా తెరకెక్కిన ఈ సినిమా ఓ సిబిఐ కేసు చుట్టూ తిరుగుతుంది. రొమాంటిక్‌ కామెడీగా తెరకెక్కి మంచి సక్సెస్‌ సాధించిన సినిమా యే జవానీ హై దివాని.. రణబీర్‌ కపూర్‌, దీపికా పదుకునే జంటగా తెరకెక్కిన ఈ ఫ్యూచరిస్టిక్‌ రొమాంటిక్‌ మూవీ యూత్‌ని విపరీతంగా ఆకట్టుకుంది. ఇదే లిస్ట్‌లో ఘనవిజయం సాదించిన మరో లవ్‌స్టోరి రామ్‌లీలా.. సంజయ్‌లీలా బన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పొయటిక్‌ రోమాంటిక్‌ డ్రామా ఫిల్మ్‌ యూత్‌ ఆడియన్స్‌ను ఓ రేంజ్‌లో ఆకట్టుకుంది. చిన్న సినిమాగా రిలీజ్‌ అయి ఘనవిజయం సాదించిన మరోసినిమా ఆషికీ 2, 90స్‌లో రిలీజ్‌ అయిన మ్యూజికల్‌ బ్లాక్‌ బస్టర్‌ మూవీ ఆషీకి సీక్వల్‌గా తెరకెక్కిన ఈ రోమాంటిక్‌ మ్యూజికల్‌ మూవీ కూడా భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కేవలం 9 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా 100 కోట్లకు పైగా వసూలు చేసి లవ్‌స్టోరి ఆదరణను మరోసారి ప్రూవ్‌ చేసింది. ఈ సినిమాలతో పాటు వందకోట్ల క్లబ్‌లో చేరిన మరో సినిమా గ్రాండ్‌ మస్తీ.. యూత్‌ ఆడియన్సే టార్గెట్‌గా అడల్ట్‌ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమా కూడా మంచి వసూళ్లనే రాబట్టింది. ఇక ఈ నెల 20 న రిలీజ్ అవుతున్న ధూం 3 కూడా భారి కలెక్షన్స్ సాధించడం ఖాయమని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్త పరిచారు. అమీర్ సూపర్ స్టంట్స్ తో , కత్రినా అందాలతో, అభిషేక్ మాన్లీ యాక్టింగ్ తో ఈ సినిమా ఆడియెన్స్ కి ఓ మూవీ ఫెస్ట్ లా అనిపిస్తుందని బాలీవుడ్ సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: