బాలీవుడ్‌లో ఎప్పటి నుండో హాట్ ఎఫైర్‌ను కొన‌సాగిస్తున్న హాట్ పెయిర్స్ ఎవ‌రు అంటే అంద‌రూ చెప్పే స‌మాధానం ఒక్కటే. వారిద్దరే ర‌ణ్‌భీర్‌క‌పూర్‌, క‌త్రినాకైఫ్‌. వీరిద్దరూ ఎప్పటిక‌ప్పుడూ మీడియాలో సెంట్రాఫ్ ఎట్రాక్షన్‌గా నిలుస్తూనే ఉంటారు. గ‌త కొన్ని నెల‌ల క్రితం స్పెయిన్ టూర్‌లో బికినితో ద‌ర్శన మిచ్చిన క‌త్రినా, లేటెస్ట్‌గా ఓ మూవీ ధియోట‌ర్‌లో ప‌బ్లిక్‌లో ద‌ర్శన‌మిచ్చి మ‌ళ్ళీ వార్తల్లో నిలిచారు. అయితే వీరిద్దరి మ‌ధ్య ఉన్నది ప్రేమ బంధ‌మా, ఎఫైర్ బంధ‌మా, లేక‌పోతే అంత‌కు మించిన రిలేష‌నా అంటూ ర‌క‌ర‌కాల న్యూస్ బాలీవుడ్‌లో చ‌క్కెర్లు కొడుతుంది. ఫైనల్‌గా ర‌ణ్‌భీర్‌క‌పూర్ గురించి క‌త్రినాకైఫ్ ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చింది. న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా క‌త్రినాకైఫ్ త‌న మ‌న‌స్సులోని మాట‌ను మీడియాకు వివ‌రించింది. ర‌ణ్‌భీర్‌క‌పూర్ క‌త్రినాకైఫ్‌ను పెళ్లి చేసుకుంటాన‌ని ప్రపోజ్ చేశాడంట‌. అయితే అందుకు క‌త్రినాకైఫ్ నుండి ఇంకా అంగీకారం రాలేదు. క‌త్రినాకైఫ్ త‌న ఫిల్మ్ కెరీర్‌ను మ‌రింత స్ట్రాంగ్‌గా మార్చుకోవ‌డానికి ప్రయ‌త్నిస్తుంది. దాంతో ర‌ణ్‌భీర్ క‌పూర్ మ్యారేజ్ ప్రపోజ‌న‌ల్‌ను త‌ను ప‌క్కన పెట్టిన‌ట్టుగా క‌త్రినాకైఫ్ వివ‌రించింది. 'ఇద్దరూ ఇంత ప‌బ్లిగ్గా ఓపెన్ ఎఫైర్ చేస్తున్నప్పుడు పెళ్ళి చేసుకోని ఆ ప‌నులేవో చేయ‌చ్చుగా' అని బిటౌన్ అంటుంది. ఓవైపు రొమాన్స్ చేసుకుంటూ మ‌రో వైపు స్నేహితులం అంటూ క‌వ‌రింగ్‌లు చేసుకోవ‌డం ఎందుకు అని కొంద‌రు మండిప‌డుతున్నారు. అయితే క‌త్రినాకైఫ్ ఈ విధంగా చెప్పటానికి కార‌ణం, త‌ను న్యూఇయ‌ర్ స్టార్టింగ్‌లోనూ టాక్ ఆప్ ది టౌన్‌గా ఉండ‌టానికే ఈ విధ‌మైన స్టేట్‌మెంట్ ఇచ్చి ఉంటుంద‌ని బిటౌన్ టాక్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: