రేణు దేశాయ్ మొన్న నూతన సంవత్సరం సందర్భం గా పూణేలో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎప్పటిలాగే తను ఈ సంవత్సరం తీయ బోయే సినిమాల గురించి అదేవిధంగా తాను ఈ స్థాయి కి రావడానికి పవన్ అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలియ చేసింది అనే వార్తలు వస్తున్నాయి.  అంతే కాదు తాను దర్శకురాలిగా, స్క్రిప్ట్ రైటర్ గా, నిర్మాతగా సాధించిన విజయాలు పవన్ కు డేడికేట్ చేస్తూ మాట్లాడిన మాటలు వెనుక ఉన్న వ్యూహాత్మక ఎత్తుగడ ఏమిటి అని అందరూ ఆలోచిస్తున్నారు. అంతే కాదు పవన్ గొప్ప మానవతావాది అని అతడు లేకుంటే తనకు ఈ విజయాలు లభించేవి కావని మాట్లడడం మరింత ఆశ్చర్యం కలిగించింది.  తనకు సహకరిస్తున్న మరాఠీ మీడియాకు కృతజ్ఞతలు తెలియచేసి పవన్ లేటెస్ట్ మేరేజ్ గురించి ఎటువంటి ప్రస్తవనా లేకుండా ఆమె జరిపిన ప్రెస్ మీట్ లోని ఆమె వ్యాఖ్యల అర్ధం ఏమిటి అనే విషయం పై ఎవరికి తోచిన విశ్లేషణలను వారు చేసుకునేలా రేణు వ్యూహాత్మక ప్రవర్తన ఉంది అని అనిపించే టట్లు గా ఆమె మాటలు ఉన్నాయి అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: