టైటిల్ చూసి ప్రభాస్, మెహర్ రమేష్ కలిసి మరోసారి పనిచేస్తున్నారేమో అనుకున్నారా..? అది కాదు ఇక్కడ మ్యాటర్.. ఎందుకంటే ప్రభాస్ బాహుబలి షూటింగ్ అయ్యేదాకా ఇంకే సినిమా చేయనుకాక చేయను అని భీమ్షించుకు కుర్చున్నాడు. రాజమౌలి మీద ఉన్న నమ్మకం తో రెండు సంవత్సరాలు ఆ సినిమాకే డేట్స్ ఇచ్చేశాడు. ఇక ఒక వేళ ప్రభాస్ సినిమా చేసే చాన్స్ ఉన్నా మెహర్ రమేష్ తో మాత్రం అసలు చేయడు ఎందుకంటే మెహర్ ని నమ్మి మోసపోయిన వారు చాలామందే ఉన్నారు తాజాగా విక్టరీ వెంకటేష్ తో సహా.. ఇక అసలు విషయానికొస్తే బిల్లా మాత్రుక సినిమా తమిళ్ బిల్లా సినిమా చేసిన విష్ణు వర్ధన్ , అజిత్ లు కలిసి మరళ ఇంకో సినిమా చేయడానికి సన్నాహలు చేస్తున్నారు. ఆల్రెడీ బిల్లా తర్వాత ఆరంభం సినిమా చేసిన వీరిద్దరు మళ్లి ముచ్చటగా మూడో సినిమా చేయబోతున్నారు. ప్రస్తుతం అజిత్ గౌతం మీనన్ డైరక్షన్లో సినిమా ఓకే చేశాడు ఆ సినిమా అయిపోగానే విష్ణు సినిమా స్టార్ట్ చేస్తారట. కోలీవుడ్ లో స్టైలిష్ సినిమాలను తీస్తున్న విష్ణు వర్ధన్ మన పవర్ స్టార్ తో పంజా సినిమా తీశాడు, ఆ సినిమా హిట్ కాకపోయినా స్టైల్ పరంగా పవర్ స్టార్ ని ఇంకొంచం స్టైలిష్ గా చూపించాడు. అజిత్ తో మూడోసారి చేయబోతున్న ఈ సినిమాలో అజిత్ క్యారక్టర్ ని గ్యాంగ్ స్టర్ గా డిజైన్ చేస్తున్నాడట విష్ణు వర్ధన్. మరి ఈ సినిమా తెలుగు వారికి అందించే అవకాశం ఉందా లేదా అన్నది ఇంకా తెలియదు.సాధారణంగా కొద్దిగా స్టార్ కాస్ట్ ఉన్న ప్రతి తమిళ్ సినిమా తెలుగులో డబ్ చేస్తున్నారు నిర్మాతలు మరి ఆ సినిమా కూడా ఇక్కడికి వచ్చి అందరిని అలరించాలని కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి: