తెలుస్తున్న సమాచారం వాస్తవం అయితే చిత్ర పరిశ్రమలో యువ హీరోల నుంచి త్వరలో పెద్ద విప్లవం రాబోతోంది అని అంటున్నారు. కొందరు యంగ్ హీరోలు తమను అణగదొక్కుతున్న వారిని ఎదురించేందుకు తెరవెనుక నుంచి చకచకా పావులు కదుపుతున్నారు అనే వార్తలు వస్తున్నాయి.1980 వరకు తెలుగు పరిశ్రమలో లేని వికృత ధోరణులు 90 తర్వాత మొదలై నలుగురు వ్యక్తుల చేతుల్లోకి ఇండస్ర్టీ వెళ్లిపోయింది అని చాలా మంది తెర వెనుక అనుకునే మాటలు ఉదయ్‌కిరణ్ ఆత్మహత్యతో ఒక్కసారిగా సినీ మాఫియాగా పేరు మారి వెలుగులోకి వచ్చింది.  ఉదయ కిరణ్ తో సహా అనేకమంది అవకాశాల్లేక చాలామంది ఇబ్బందిపడి సూసైడ్‌ చేసుకున్నవారే అనేది వీరి వాదన. దీనికి కారణం కేవలం నలుగురు వ్యక్తులు కొత్తవారికి అవకాశం ఇవ్వకుండా టాలీవుడ్ ను శాసిస్తున్నట్లు వీరి వాదన. వీళ్లపై ఎవరైన ఆరోపణలు చేసిన యువనటులు చివరకు బాధితులుగా మిగిలిపోతున్నారని వీరివాదన. ఉదయ్‌కిరణ్ ఆత్మహత్య తో కొంతమంది పెద్దలు బహిరంగంగా విమర్శలు చేయడంతో ఈ మాఫియాపై మాట్లాడేందుకు యువ నటులు ఒక్కొక్కరుగా ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు టాలీవుడ్ లో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.  అంతేకాదు చాలామంది ప్రొడ్యూసర్లు కూడా వాళ్లు చెప్పినట్లే వ్యవహరిస్తున్నారని వీరి వాదన. యువ హీరోలు ఇండస్ట్రీలో రాణించాలంటే వీరిలో ఎవరో ఒకరి అండ ఉండాలని లేకుంటే వారి కెరియర్ ముందుకు వెళ్ళదని వీరి ఆవేదన. అంతేకాదు కొత్తగా ఏ ప్రొడ్యూసర్ ఇండస్ర్టీలోకి వచ్చినా ఆ నలుగురు వ్యక్తులకు సంబంధించిన వారిలో ఎవరితోనైనా సినిమా తీస్తేనే కొద్దిరోజులపాటైనా నిర్మాతగా బాతకగలుగుతున్నారని వీరి భావన. తాజాగా ఉదయ్‌కిరణ్ మృతితో యువనటుల్లో ఐక్యత వచ్చినట్లు తెలుస్తోంది. మాఫియా చేతిలో నలిగిపోతున్న కొందరు యువ నటులు నోరు విప్పేందుకు సిద్ధమైనట్లు సమాచారం.  ఈ మేరకు ఓ సీనియర్ నటుడితో యువ హీరోలంతా సమావేశమై ఈ మాఫియాను ఎదుర్కోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే వాళ్లు ఏ రూపంలో బయట పడతారో లేదంటే ఇది తాత్కాలిక ఆవేసమేనా అనే విషయం రానున్న రోజులలో తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: