138 సినిమాలకు దర్శకత్వం వహించిన కోడి రామకృష్ణకు ఒక విచిత్రమైన అలవాటు ఉంది తన నుదిటి చుట్టూ గుడ్డ కట్టుకుని షూటింగ్ స్పాట్ లో కనిపిస్తాడు కోడిరామకృష్ణ . ఆఖరుకు రాత్రిపూట షూటింగ్ లలో కూడా ఇలాగే ఉంటాడు ఆయన. కోడిరామకృష్ణ కు తన తల గుడ్డ, చేతిదారాల సెంటిమెంట్ రహస్యం ఈరోజు ఒక ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనే స్వయంగా ఈ గుట్టు విప్పాడు.  కోడిరామకృష్ణ గతంలో ‘మాపల్లెలో గోపాలుడు’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు ఆయన దగ్గర కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తున్న మోకా రామారావు అనే వ్యక్తి రామకృష్ణ దగ్గరకు వచ్చి మీ నుదిటి భాగము చాల పెద్దది కాబట్టి ఎండలో అది తెగ మాడిపోతోంది అని చెప్పి తన జేబులోని జేబురమలతో కోడి రామకృష్ణ నుదిటి చుట్టూ గుడ్డ కట్టాడట.  అది చూసిన తరువాత అది తనకు బాగా నప్పింది అని అదే మోకా రామారావు రామకృష్ణ నుదిటి కొలతల ప్రకారం ఒక బ్యాండ్ లా చేయించి రామకృష్ణకు ఇస్తే దానిని కోడిరామకృష్ణ వాడుతూ వచ్చాడట. అయితే అనుకోకుండా ఈ గెటప్ లో తనను చుసిన ప్రఖ్యాత దర్శకుడు కె. బాలచందర్ ఈ గెటప్ లో రామకృష్ణను చూసి ఈ అవతారం ఈ జన్మది కాదు క్రితంజన్మ తాలుకు వాసనది అని బాలచందర్ భావయుక్తంగా అనడంతో ఈ తలగుడ్డ తనకు బాగా నప్పిందని సన్నిహితులు కూడా అనడంతో తను షూటింగ్ చేసేడప్పుడు ఈ తల గుడ్డను విడిచి ఉండ లేకపపోతున్నానని అసలు విషయం చెప్పాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: