మా అబ్బాయితో ఇంకోసారి ఇలా తిరిగావాంటే మర్యాద దక్కదు....ఈ మాటలు అన్నది ఎవరో కాదు తమిళ హీరో ఆర్య వాళ్ల అమ్మ. అన్నది ఎవరినో కాదు తెలుగు తమిళ ఇండస్ట్రీల్లో ఒక ఊపుఊపుతున్న నయనతారను.. . ఒకానొక సందర్భంలో ఆర్య తల్లి నయనతారను చెడామడా కడిగేసింది. మొదట శింబుతో ప్రేమాయణం....ఆ తర్వాత ప్రభుదేవాతో సరససల్లాపం...ఇదీ నయనతార రొమాంటిక్ లవ్ స్టోరీ. ఇక రీసెంట్ గా ఈ అమ్మడు తమిళ యువ నటుడు ఆర్యతో క్లోజ్ మూవ్ అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ ఇద్దరూ కలిసి నటించిన మూడు సినిమాలు బాక్సాపీస్ వద్ద బాగానే క్లిక్ అయ్యాయి. దీంతో ఈ కాంబినేషన్ పై నిర్మాతలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇన్ని సార్లు కలిసి నటించడం వల్ల ఇద్దరి మధ్య తెలియని సంబంధమేదో బలపడింది. నయనతార, ఆర్యలు డేటింగ్ చేస్తున్నారని తమిళ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. నయన మళ్లీ ప్రేమలో పడిందని, ఆర్యతో జతకట్టడం ఖాయమంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇక ఈ విషయాలన్ని ఆర్య తల్లి చెవిన పడటంతో ఆమె ఫైర్ అయింది. తన కొడుక్కి దూరంగా ఉండకపోతే మర్యాద దక్కదని వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఐతే ఈ విషయంపై అటు ఆర్యగానీ, నయనతారగానీ ఏ రకంగానూ స్పందించలేదు...ఐనా చేసేదంతా సైలెంట్ గా చేస్తుంటే , ఇంకా మాటలెందుకు అని ఆడియన్స్ అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: