ఏ.ఆర్ మురగదాస్ విజయ్ తో తుపాకి సినిమా తీసి హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఆ సినిమా తర్వాత మరళ వారు కలిసి పనిచేయడానికి రంగం సిద్దం చేసుకున్నారు. ఈ సినిమాలో విజయ్ డ్యుయల్ రోల్ చేయబోతున్నాడట. మురగదాస్ సినిమాలకు సౌత్ లో మంచి క్రేజ్ ఉంది. తను చేసిన ప్రతి సినిమా యూత్ ని ఎంతగానో ఎక్ట్రాక్ట్ చేస్తుంది. మురగదాస్ కూడా తన సినిమాల్లో యూత్ మెచ్చే అంశాలను చేరుస్తాడు. ఎపిహెరాల్డ్‌.కామ్ అందిన సమాచారం ప్రకారం ఈ సినిమాలో విజయ్ చాలా ట్రెండీ లుక్ తో ఉంటాడట. ఇంకా ఈ సినిమాలో మాంచి పంచ్ డైలాగ్స్ కూడా బోలెడన్ని ప్లాన్ చేస్తున్నాడట మురగదాస్. ప్రస్తుతం మురగదాస్ అక్షయ్ కుమార్ సినిమా చేస్తున్నాడు ఆ సినిమా కంప్లీట్ అవ్వగానే విజయ్ సినిమాను స్టార్ట్ చేస్తాడట. ఇక విజయ్ విషయానికొస్తే ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్న ఇళయదళపతి ఈ సినిమాతో మళ్లీ మంచి సూపర్ హిట్ కొట్టాలని ప్లాన్ చేస్తున్నాడట. విజయ్ ఇదవరకే అజాగియా తమిళ్ మగన్, విల్లు సినిమాలో డ్యుయల్ రోల్ వేశాడు. సో మరోసారి కలుస్తున్న ఈ తుపాకి కాంబినేషన్ హిట్ కొట్టాలని కోరుకుందాం. తుపాకి జోడి హిట్ కొడుతుందా..?

మరింత సమాచారం తెలుసుకోండి: