ఇండియన్ మైఖైల్ జాక్సన్ గా పేరుగాంచిన ప్రభుదేవాకు ఎంత ప్రతిభ ఉందో అంతకు మించి ఎప్పుడు వివాదాలలో చిక్కు కుంటూ ఉంటాడు. తన ప్రేమ వ్యవహారాల దగ్గర నుంచి తాను తీస్తున్న సినిమాల వరకు ఏదో ఒక సంచలనం ప్రభుదేవా సొంతం. కోలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు వెళ్లి అక్కడ దర్శకుడిగా తనకంటూ ఒక గుర్తింపును పొందాడు ప్రభుదేవా.  ఈయన ఈమధ్య దర్శకత్వం వహించిన రాంబో రాజ్‌కుమార్ టైటిల్ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. చివరికి రాంబో రాజ్‌కుమార్ ఆర్.రాజ్‌కుమార్‌గా పేరు మార్చారు. తాజాగా ప్రభుదేవా తీస్తున్న యాక్షన్ జాక్సన్ టైటిల్ వివాదాల్లో చిక్కుకుంది. ఈ చిత్రంలో అజయ్ దేవ్‌గణ్, సోనాక్షి సిన్హా, యామీ గౌతమ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.  అయితే ఈ సినిమా టైటిల్ తమ సంస్థ పేటెంట్ అని దాన్ని బాలీవుడ్ చిత్రానికి ఉపయోగించ రాదంటూ ప్రముఖ హాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్ ప్రభుదేవాకు, ఆ చిత్ర నిర్మాతకు నోటీసులు జారీ చేసింది అని తెలుస్తోంది. అంతే కాదు ప్రభుదేవా తన సినిమాకు యాక్షన్ జాక్సన్ పేరును వాడరాదని, లేకుంటే తాము చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆనోటీసులో పేర్కొంది అని సమాచారం  అయితే ఈ వ్యవహారంలో ప్రభుదేవా చెపుతున్న తీరు వేరే విధంగా ఉంది. ఈ టైటిల్ ను యాక్షన్ జాక్సన్ గాముంబాయిలోని నిర్మాతల మండలిలోనూ, నిర్మాతల గిల్డ్‌లోను నమోదు చేశామని, ఈ టైటిల్‌పై ఎవరూ ఎలాంటి అభ్యంతరాలు చెప్పే అవకాశం లేదని అంటున్నాడు ప్రభుదేవా. మరి ఈ వ్యవహారం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: