ఫిబ్రవరి 7న రిలీజ్ అయిన పైసా మూవీ బాక్సాపీస్ అదే వేగంతో ముంద‌కు వెళుతుంది. రిలీజ్ అయిన మొద‌టి రోజు నుండి నేటి వ‌ర‌కూ క‌లెక్షన్స్ విష‌యంలో ఎటువంటి స్పీడు అందుకోక‌పోయిన‌ప్పటికీ మినిమం క‌లెక్షన్స్‌ను కొల్లగొడుతుంది. పైసా మూవీ మొద‌టి రోజు బాక్సాపీస్ నాలుగు కోట్ల రూపాయ‌లుగా లెక్క తేల‌గా త‌రువాత వీకెండ్‌ కాడంతో ఈ క‌లెక్షన్స్ మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంటుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు లెక్కలు వేసుకున్నాయి. పైసా మూవీ బాక్సాపీస్ రిపోర్ట్ గురించి ఎపిహెరాల్డ్‌.కామ్ స‌మాచారాన్ని అందిస్తుంది. పైసా మూవీ మొద‌టి మూవీ మూడు రోజుల బాక్సాపీస్ రిపోర్ట్‌ను చూసుకుంటే ఈ మూవీ ఇప్పటి వ‌ర‌కూ దాదాపు ప‌ది కోట్ల రూపాల‌య క‌లెక్షన్స్‌ను కొల్లగొట్టింది. కేవ‌లం నాని, కృష్ణవంశీ బ్రాండ్‌ల మీద ప్రేక్షకులు ధియోట‌ర్ వ‌ర‌కూ వ‌స్తున్నారు. డీసెంట్ స‌క్సెస్ అనే పాజిటివ్ టాక్‌తో, ఇప్పటికీ ధియోట‌ర్లు యాభై శాతం ఆక్యుపెన్సీతో ప్రద‌ర్శించ‌బ‌డుతున్నాయి. పైసా మూవీ మొద‌టి రోజు బాక్సాపీస్ 3.50 కోట్ల రూపాయ‌లు కాగా, రెండువ రోజు బాక్సాపీస్ 3.25 కోట్ల రూపాయ‌లు. మూడ‌వ రోజు బాక్సాపీస్ 3.02 కోట్ల రూపాయ‌లు. మొత్తంగా మూడు రోజుల క‌లెక్షన్స్ వ‌చ్చి 9.77 కోట్ల రూపాలుగా తేలింది. రెండో వారంలో ఈ క‌లెక్షన్స్ బాగా త‌గ్గుముఖం ప‌ట్టే అవ‌కాశం ఉంద‌ని ట్రేడ్స్ చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: