టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం ‘ఆగడు' సినిమాను చాల వేగంగా చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై చాల అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు బాలీవుడ్ సూపర్ హిట్ ‘స్పెషల్ చభ్బీస్ 'చిత్రం నుంచి కాపీ చేస్తున్నారని ఫిల్మ్ నగర్ టాక్. ఆ సినిమాలో హైలెట్ గా నిలిచిన రెండు సన్నివేశాలు కొద్దిపాటి మార్పులతో ఈ చిత్రంలో ఉంటాయని చెప్పుకుంటున్నారు.  గతంలో మహేష్, శ్రీనువైట్ల కాంబినేషన్ లో వచ్చిన ‘దూకుడు’ చిత్రం జర్మనీ చిత్రం ‘గుడ్ బై లెనిన్’ నుంచి ప్రేరణ పొందింది అనే వార్తలు అప్పట్లో వచ్చాయి. బాలీవుడ్ లో విడుదలైన ‘స్పెషల్ చబ్బీ’స్ యదార్థ సంఘటలన ఆధారంగా తీసిన సినిమా. ఈ చిత్రంలో అక్షయ్ నకిలీ పోలీసాఫీసర్‌గా చేశాడు. దర్శకుడు నీరజ్‌పాండే తనదైన శైలిలో ఈ చిత్రాన్ని అద్భుతంగా తీసాడు. అదే విధంగా ‘ఆగడు'లో మహేష్ పాత్ర నానా పటేకర్ ‘అబ్ తక్ చప్పన్’ చిత్రంలో చేసిన ఎనకౌంటర్ స్పెషలిస్ట్ ప్రేరణతో ఉంటుందని అంటున్నారు.  అలాగే ఈ పాత్ర పేరు ఎనకౌంటర్ శంకర్ అని, అనంతపూర్ బ్యాక్ డ్రాప్ లో ఈ కధ నడుస్తుందని ఇప్పటికే వార్తలు వచ్చేసాయి. దర్శకుడు శ్రీనువైట్ల మార్క్ కామెడీని దట్టంగా దట్టించి ఏదోవిధంగా ‘ఆగడు’ సూపర్ హిట్ చేయాలని ఈ సినిమా నిర్మాతలు చాల గట్టి ప్రయత్నమే చేస్తున్నారట.  

మరింత సమాచారం తెలుసుకోండి: