హీరోయిన్స్ తమ పాపులారిటీ పెంచుకోవడం కోసం రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు. మలయాళం, తమిళ భాషల్లో నటిగా పేరు తెచ్చుకున్న రిమా కల్లింగళ్ మరీ బరితెగించి చేసిన సాహసం సౌత్ ఫిలిం ఇండస్ర్టీ లో హాట్ న్యూస్ గా మారింది. అందుకు కారణం ఆమె తన సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఎకౌంట్‌లో ''సెక్స్ ఆన్ ది బీచ్'' అని స్టేటస్ అప్‌డేట్ పెట్టడమే.  రీసెంట్‌గా మలయాళీ దర్శకుడు ఆశిఖి అబుని పెళ్లాడిన రిమా పెట్టిన ఈ హాట్ పోస్ట్ అమ్మడిని వివాదాల్లోకి నెట్టింది. భర్త అబుతో కలిసి బీచ్‌లో వాలెంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకున్న రిమా అక్కడే సెక్స్ కూడా చేసుకున్నట్లుగా చెప్పడం జనానికే కాదు, మీడియాను కూడ తట్టుకోలేకుండా చేసింది.  యువతరాన్ని తప్పుదొవపట్టించేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయి అంటూ సోషల్ మీడియాలో ఆమె పై నిరసన జ్వాలలు ఎగిసి పడుతున్నాయి. ఇంకొంత మందైతే కోపంలో ఏవేవో తప్పుడు రాతలు కూడా రాసేశారు. దీంతో తాను చేసిన తప్పేంటో తెలుసుకున్న రిమా ఆ తర్వాత, 'యాక్చువల్లీ జరిగింది అది కాదు..' అంటూ మరో పోస్ట్ పెట్టింది. తన ఉద్దేశం కాక్ టెయిల్ అంటూ ఈసారి డ్రింక్ తాగుతున్న ఫోటో పెట్టింది.  కానీ ఏం లాభం అప్పటికే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది. సమాజంలో సేలేబ్రెటెలు గా ఒక ఉన్నత స్థాయిలో ఉన్న వారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం.  

మరింత సమాచారం తెలుసుకోండి: