ఒకప్పుడు తెలుగు, హిందీ చిత్రాల్లో అసిన్ లీడింగ్ హీరోయిన్. బాలీవుడ్ లో వంద కోట్ల హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. అయితే అప్పుడు ఫుల్‌బిజీగా వుండే అసిన్‌‌కి తీరిక దొరికినట్టుంది. ఓ సెల్‌ఫోన్ అధినేత‌తో ఈమె ఎక్కడపడితే అక్కడ కనిపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం అసిన్‌కి కొత్త బాయ్‌ఫ్రెండ్ దొరికాడు.  ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ మైక్రోమాక్స్ అధినేత రాహుల్‌శర్మతో రొమాన్స్ చేస్తోందంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇంతకి ఓ ఫ్రెండ్ ద్వారా ఈ బ్యూటీకి శర్మ పరిచయమయ్యాడట అప్పటి నుంచి ఇద్దరూ కలిసే చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారట. మైక్రోమాక్స్‌కు సంబంధించి ఏ ప్రాడక్ట్ ప్రారంభించినా అసిన్‌కు రాహుల్ స్పెషల్ ఇన్విటేషన్ పంపిస్తున్నాడంటూ బాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. అంతేకాదు ఒకరిని విడిచి మరొకరు వుండలేకపోతున్నారంటూ మాట్లాడుకుంటున్నారు  ఫ్రెండ్‌షిప్ కాస్తా డేటింగ్ గా మారినట్లు గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై రాబోయే రోజుల్లో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి. ప్రస్తుతం సినిమాలలో అవకాశాలు లేక పోవడంతో ఆ మధ్య పెళ్లి ఫై గాలి మళ్ళిన అసిన్ కు ఈ సెల్ ఫోన్ కంపెనీ అధినేత అసిన్ తో పెళ్లి పీటలు ఎక్కుతడా లేకుంటే ఈ ప్రేమ డేటింగ్ తో ఆగిపోతుందా అనే విషయం రాబోయే రోజులలో తెలుస్తుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: