దశావతారాలలో శ్రీరామ అవతరానికి ఉన్న ప్రాముఖ్యత మరే అవతారానికి లేదoటే అతిసయోక్తి కాదు. మానవుడు ఎలా జీవించాలో శ్రీరాముడి అవతారం తెలియ చేస్తుంది. శ్రీరాముడి జన్మదినం రోజునే శ్రీరాముడి కళ్యాణాన్ని కూడ మనం యుగయుగాలుగా జరుపు కుంటున్నాo. పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే జరిగింది. ఈ చైత్ర శుద్ధ నవమి నాడు ఆంధ్రప్రదేశ్ లో గల భద్రాచలమందు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు. రామా అనే రెండక్షరాల రమ్యమైన పదంలో ఒక మహత్తరమైన శక్తి ఉండటంతో ఈరోజు దేశంలోని పలుకని జిహ్వ-జిహ్వే కాదు. శ్రీరామ నవమి పండుగను భారతీయులందరూ పరమ పవిత్రమైన దినంగా భావించి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అతి వైభవంగా పట్టణంలో, పల్లెపల్లెల్లోనూ రమణీయంగా జరుపుకోవడం ఓ సంప్రదాయం. భక్తుల గుండెల్లో కొలువై, సుందర పల్లెపల్లెలా శ్రీరాముడి కళ్యాణాన్ని మన ఇంటి వేడుకగా జరుపుకుని ఆ కల్యాణాన్ని తిలకించి శ్రీరాముని దర్శించి ఆ దేవ దేవుడి ఆశీస్సులు పొందుతారు. సీతారామ కళ్యాణం లోక జీవన హేతుకం, సకల దోష నివారణం, సర్వ సంపదలకు నిలయం, సకల జన లోక సంరక్షణమే శ్రీరామనవమి పండుగ పరమార్థం. శ్రీరామచంద్రుని క్షేత్రాలలో అత్యంత వైశిష్ట్య ప్రాధాన్యత ప్రాశస్త్యముగల క్షేత్రం భద్రాచలం దివ్య క్షేత్రం. శ్రీరామచంద్రుడు తన వనవాస జీవితం ఇక్కడే గడపడమే ఈ పుణ్య క్షేత్రం యొక్క వైశిష్ట్యం. శ్రీరామ నామము సకల పాపాలను పోగొడుతుందని సకల శాస్త్రాలూ చెబుతున్నాయి. భక్త రామదాసు చెరసాలలో ఉండిపోయిన కారణంగా పూర్వము సీతారాముల కళ్యాణము మార్గశిర శుద్ధ పంచమినాడు జరిగినట్లుగా, అయితే తాను చెరసాలనుండి తిరిగి వచ్చాక చైత్రశుద్ధ నవమినాడు శ్రీరామ చంద్రుని పుట్టినరోజు వేడుకలు, కళ్యాణ వేడుకలు ఒకేసారి జరిపించారు అని అంటారు. శ్రీ సీతారామ కళ్యాణము, రాముడు రావణున్ని సంహరించి అయోధ్యకు తిరిగి వచ్చింది శ్రీరామనవమినాడే కావడం విశేషం. ఆ మరునాడు దశమి శ్రీరామ పట్ట్భాషేకం రామునికి జరిగింది అని మన పురాణాలూ చెపుతున్నాయి. రామ శబ్దంలో ఎకాక్రత ఉంది, రామ సబ్దంలో కర్తవ్య పరిపాలన ఉంది రామ శబ్దంలో పవిత్రత ఉంది. ఇన్ని అర్ధాలు ఉన్న రామరామాన్ని జపించు కుంటు ఈరోజు జరుగుతున్న సీతారాముల కళ్యాణం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పది కోట్ల మంది తెలుగు వారికి సకల శుభాలు కలుగ చేసి శ్రీరాముడి కరుణా కటాక్ష వీక్షణాలు మన అందరి పై ఉండాలని కోరుకుందాం.. 

మరింత సమాచారం తెలుసుకోండి: