కంగనారనౌట్ అంటే ఇప్పుడు బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్. ఎందుకంటే గత మూడు సంవత్సరాలుగా కంగనారనౌట్ అతి తక్కువ మూవీల్లో నటించినప్పటికి తనకు ఉన్న క్రేజ్ మాత్రం బాలీవుడ్ లో అలాగే ఉంది. లేటెస్ట్ గా వచ్చిన క్వీన్ మూవీ సైతం బాలీవుడ్ బాక్సాపీస్ షేక్ చేయండంతో కంగనా సత్తా ఏంటో మరోసారి చూపించింది. ఇదిలా ఉంటే కంగనారనౌట్ కి 13 ఏళ్ళ రహస్య కొడుకు ఉన్నాడు అంటూ బిటౌన్ లో న్యూస్ వినిపిస్తుంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. 'క్వీన్' సినిమాతో బాలీవుడ్ ను షేక్ చేసిన బ్యూటీ 'కంగనా రనౌత్'. ఈ సినిమాలో కంగనా నటనకు ఫిదా కానీ ఆడియెన్స్, బాలీవుడ్ సినీ వర్గాలు లేరంటే అతిశయోక్తి కాదు. దీంతో ఇప్పుడు ఈ ముద్దుగుమ్మకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. కంగనాను టార్గెట్ చేసుకుని కథలు రాసుకునే దర్శకులు ఇండ్రస్ట్రీలో పెరిగిపోతున్నారు. దీనిలో భాగంగానే కంగనా.. తాజాగా ఓ సినిమాకు ఒప్పుకుంది. నటనకు ఆస్కారం ఉన్న ఈ పాత్రను ముందుగా విద్యాబాలన్ తో చేయించాలనుకున్నారు. కానీ 'క్వీన్' హిట్ అవడంతో విద్యా స్థానంలో కంగనాను తీసుకున్నారు. 'కహానీ' ఫేమ్ సుజయ్ ఘోష్ డైరెక్ట్ చేయబోయే ఈ సినిమాలో కంగనా 40 యేళ్ల గృహిణిగా, 13యేళ్ల కొడుకుకు తల్లిగా నటిస్తోంది. ఇక ఇందులో మరో విశేషం ఏంటంటే.. కంగనా ఏజ్ ఇప్పుడు 27మాత్రమే. అయినా పాత్ర కోసం వయస్సు లెక్కలు మార్చుకుందన్నమాట. మరి ఈ పాత్రలో కంగనా ఎలా మెప్పిస్తుందో కానీ, బాలీవుడ్ ప్రకారం చిన్న వయస్సులోనే ఈ అమ్మడు తాజా సినిమాతో రిస్క్ చేస్తుందని అంటున్నారు. మరి ఆ రిస్క్ ఏంటో తెలియాలంటే.. మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: