టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రెజెంట్ వినిపిస్తున్న టాక్ ప్రకారం శేఖర్ కమ్ముల ఓ నిర్ణయాన్ని తీసుకున్నాడని చెబుతుంది. ప్రస్తుతం శేఖర్ కమ్ముల తీసుకున్న నిర్ణయం, ఎప్పుడో తీసుకొని ఉంటే చాలా వరకూ సేఫ్ అయ్యేవాడని టాలీవుడ్ అంటుంది. ఇంతకీ శేఖర కమ్ముల తీసుకున్న నిర్ణయం ఏంటో, దానికి సంబంధించిన సమాచారాన్ని ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. శేఖర్ కమ్ముల తన కెరీర్లో మొట్ట మొదటి సారిగా రీమేక్ చేసిన సినిమా ‘అనామిక’. అయితే ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ చేశాడో, అప్పటి నుండి తనకు కష్టాలు మొదలయ్యాయనే చెప్పాలి. హీరోయిన్ గా నయనతారను తీసుకోవడం తను తీసుకున్న రాంగ్ డెసిషన్ అని రీసెంట్ గా శేఖర్ కమ్ముల, తన సన్నిహితులు వద్ద అన్నాడట. ఈ ఒక్క సినిమాతోనే మరో సారి రీమేక్ సినిమాలను డైరెక్ట్ చేయనని శేఖర్ కమ్ముల మరో ఇంటర్వ్యూలో చెప్పాడు. డైరెక్ట్ గా మూవీలను తీయటమే చాలా సులభం. వేరే భాషా మూవీలను మన భాషలోకి మార్చుకొని, అలాగే మన నేటివిటికి తగ్గట్టుగా మార్చుకోవాలంటే నానా ఇబ్భందులు పడాలని చెప్పుకొచ్చాడు. ‘ నేను అనామిక డైరెక్ట్ చేయాలనుకోలేదు, ఆ చిత్ర నిర్మాతలే ఈ సినిమాతో నన్ను అప్రోచ్ అయ్యారు. మొదట్లో నేను ఆ సినిమాపై అంత ఆసక్తి చూపలేదు. ఎప్పుడైతే ఢిల్లీలో నిర్భయ ఘటన జరిగిందో అప్పుడే నా సినిమాల ద్వారా ఏదన్నా మెసేజ్ చెప్పాలని అనిపించింది. దానికి అనామిక స్టొరీ చాలా కరెక్ట్ అనిపించిది. ఎందుకంటే దానిలో మహిళల గురించి చాలా విషయాలను ప్రస్తావించారు. అలాగే నేను ఒక్కడినే నా స్టొరీలు రాసుకోవడానికి ఇష్టపడతాను. కానీ మొదటి సారి ఈ సినిమా కోసం ఇంకో రైటర్ తో కలిసి పనిచేసాను. అప్పుడే అర్థమైంది రీమేక్స్ అనేది చాలా కష్టం అని, ఎందుకంటే స్టొరీ చెప్పడంలో మన స్టైల్ వేరే ఉంటుంది. అందుకే నేను ఇక రీమేక్స్ చెయ్యనని’ శేఖర్ కమ్ముల అన్నాడు. ఇదిలా ఉంటే, అసలు కారణం మాత్రం ఈ మూవీలో నయనతార పెట్టిన ఇబ్బందికి శేఖర్ కమ్ములకి రిమేక్ ల మీద విరక్తి పుట్టిందని టాలీవుడ్ అంటుంది. ఈ సినిమా మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: