కృష్ణ, కృష్ణంరాజు కలిసి పలు విజయవంతమైన సినిమాల్లో నటించారు. మరి వారి వారసులు కూడా ఒకే ఒడ్డూ పొడవుతో యువతలో మంచి ఫాలోయింగ్ లో ఉన్నారు. వీరిద్దరు కలిసి సినిమా చేస్తే చూడాలన్నది అటు సీనియర్ల, ఇటు జూనియర్ల ఆకాంక్ష. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాతో మల్టీస్టారర్ చిత్రాలకు పచ్చజండా ఊపారు మహేష్. ఎప్పుడో ‘వర్షం’ సినిమాలో గోపీచంద్ తో కలిసి నటించాడు ప్రభాస్. ఇద్దరు ఈగోల గురించి పట్టించుకోని నటులు. తెరమీద ఎక్కడా ఈగోలకు పోని నటులు.  సెట్ లోనూ సైలెంట్ గానే ఉంటారు. వ్యక్తిగతంగా ఇద్దరు మంచి మిత్రులు. మరి వారిద్దరు కలిసి నటిస్తారా? వేచి చూడాల్సిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి: