సినిమా వాళ్లలో నేను మోనార్క్ అని చెప్పుకుని అలాగే ప్రవర్తించే నటుడు ప్రకాష్ రాజ్. కానీ ఇటీవల ఓ నటి కూడా అచ్చం అలాగే ప్రవర్తిస్తోందట . ఆమె మరెవరో కాదు భూమిక. జగపతిబాబుతో లేటు వయసులో రొమాన్స్ చేస్తోంది భూమిక ‘ఏప్రిల్ ఫూల్’ సినిమా కోసం. ఈ సినిమా దర్శకుడు కె.ఎస్.ఐ స్పాట్ లో ఏమైనా డైలాగుల్లో మార్పులు చెప్తే వద్దని, తాను చెప్పనని ఖరాకండిగా చెప్తోందట భూమిక. దీనంతటికి కారణం ఆమె స్పాట్ లో చెప్పాల్సిన డైలాగులను ఎప్పుడో కంఠతా పట్టేయడమే. కొత్తగా నేర్చుకుని చెప్పే సాహసాలు చేయడం ఎందుకని ఒప్పుకోదట. తన తోటి హీరోయిన్లతో ఘాటుగా రొమాన్స్ చేసే జగపతిబాబు ఈ సినిమాలోనూ భూమికతో ఓ ఘాటు రొమాన్స్ పాట చేశారట. చూడాలంటే నవంబర్ వరకు ఆగాల్సిందే. సినిమా నవంబర్ లోనే విడుదల కానుంది మరి. 

మరింత సమాచారం తెలుసుకోండి: