అనామిక మూవీ రిలీజ్ తరువాత శేఖర్ కమ్ముల స్వరం పెంచి, మూవీలో జరిగిన విషయాలను బయటకు చెప్పేస్తున్నాడు. దీనికి సంబంధించిన న్యూస్ ను ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. శేఖర్ కమ్ముల సినిమాల్లో ఆయన హీరో, హీరోయిన్స్ పాత్రలు చాలా స్ట్రయిట్ ఫార్వార్డ్ గా మాట్లాడుతుంటాయి! ఫర్ ఎగ్జాంపుల్.... ఆనంద్ లో కమలినీ క్యారెక్టర్, గోదావరిలో సుమంత్ పాత్ర.... ఇలాంటివన్నమాట! అయితే... తెరపైనే కాదు తెర వెనుక స్వయంగా తాను కూడా స్ట్రయిట్ ఫార్వార్డ్ మనిషే అని ప్రూవ్ చేసుకుంటున్నాడు శేఖర్! అనామిక విడుదలై మంచి రెస్పాన్స్ సంపాదించుకుంది. హిందీ కహాని సినిమాతో పోల్చకుంటే ఇది కూడా బాగానే వున్నట్టు లెక్క. అంతే కాదు... ఒక రీమేక్ తీసినా కూడా శేఖర్ తన మార్క్ దానిపై వేయగలిగాడు. ఇక నయనతార సినిమా మొత్తాన్నీ `వన్ వుమన్ షో` అన్నట్టుగా నెట్టుకొచ్చింది! ఆమె పర్ఫామెన్స్ సూపర్ అంటున్నారు అంతా.... సినిమా సక్సెస్, నయన యాక్టింగ్.. ఈ విషయాలు ఎలా వున్నా... శేఖర్ మాత్రం నేరుగా, సుత్తి లేకుండా కొన్ని విషయాలు చెబుతున్నాడు. నయనతార ప్రమోషన్స్ ఎగొట్టి నానా ఇబ్బందులు పెట్టడం ఆయన్ని బాగా హర్ట్ చేసింది. ఆ విషయాన్ని మీడియాతో డైరెక్ట్ గానే చెప్పిన శేఖర్ మరో విషయం కూడా చెప్పాడు. అసలు అనామిక సినిమా కోసం నయనతార తన ఛాయిస్ కానేకాదనేశాడు! నిజానికి శేఖర్ అనుష్కని కాని, ఎవరైనా కొత్త అమ్మాయిని కాని తీసుకుందాం అనుకున్నాడట! అదీ కాకపోతే, అంజలిని కూడా కన్ సిడర్ చేశాడట! బట్... నయన మాత్రం... అనామిక నిర్మించిన.... కార్పోరేట్ సంస్థల చాయిస్ గా సెలక్ట్ అయిందట! ఆమెకైతే తెలుగు, తమిళ భాషల్లో మార్కెట్ వుంది కాబట్టి ప్రొడ్యూసర్స్ ఆమెకు ఓటు వేశారట! నయనతారనే కాదు... ఆమెని ఎంచుకున్న కార్పోరేట్ ప్రొడక్షన్ హౌజ్ లని కూడా ఎకిపారేశాడు మన స్ట్రయిట్ ఫార్వార్డ్ శేఖర్ కమ్ముల. మరీ బిజినెస్ లా ఫీలైపోయి... సినిమాని ఓన్ చేసుకోకుండా.... కొన్ని డబ్బులు ఖర్చు చేసి ఈమెయిల్స్ ఎక్స్ ఛేంజ్ చేసుకుంటే సినిమా సక్సెస్ అయిపోదని అన్నాడాయన! సినిమాని శ్రద్ధగా ప్రమోట్ చేయాలని స్పష్టం చేశాడు! వెల్... అతి త్వరలో బాలీవుడ్ కి కూడా వెళ్లాలనుకుంటున్న కమ్ముల... అక్కడ ఎలా ఫీలవుతాడో మరి! ఆఫ్ట్రాల్.... ముంబైలో టాలీవుడ్ కంటే మరింత ఎక్కువ కార్పోర్టే కల్చర్ వుంటుంది!

మరింత సమాచారం తెలుసుకోండి: