స్వామిరారా సినిమాతో బిజీబిజీగా ఉన్న నిఖిల్ తనకు సిగరెట్ తాగడమంటే నచ్చదని అంటున్నారు. సినిమాల్లో తాగాల్సి వచ్చినా వీలయినంతవరకు నో చెప్తానని అంటున్నారు. ఈ విషయం గురించి నిఖిల్ మాట్లాడుతూ ‘‘సినిమా ప్రారంభానికి ముందు సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరం అని హీరోలు చెప్పడం నాకు నచ్చడంలేదు.  నేను నటించే సినిమాల్లో అలా చెప్పాల్సి వస్తే నేను చాలా బాధపడుతాను. అందుకే వీలైనంత వరకు నా రైటర్లకు అలాంటి సన్నివేశాలను రాయవద్దని రిక్వెస్ట్ చేస్తుంటాను. ఇప్పటివరకు అలా చెప్పాల్సిన అవసరం నాకు రాలేదు’’అని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: