‘ఈ రోజుల్లో’ సినిమాతో పెద్ద హిట్ కొట్టిన శ్రీ సినిమాల్లో హీరో అవుతానని ఎప్పుడూ అనుకోలేదట. ఎంబిఎ ఫస్టియర్ లో ఉన్నప్పుడే ఓ కంపెనీలో హెచ్ ఆర్ గా ఉద్యోగంలో చేరారు శ్రీ. పని చేస్తున్నారు గానీ ఆయన మనసంతా సినిమాల మీదే ఉందట.  తన స్నేహితుడు ఒకరు దర్శకుడు మారుతితో డిస్కషన్స్ కు వెళ్తుంటే తను కూడా వెళ్ళాడట. తన ఫేస్కు హీరోగా పనిచేసే అవకాశం వస్తుందని ఎప్పుడూ ఊహించను కూడా లేదట శ్రీ . విలన్ గానో, కమెడియన్ గానో, మరో నటుడిగానో కనీసం ఓ సినిమాలోనైనా కనిపించాలనుకున్నారట. కానీ ఇతనులోని ఉత్సుకతను గమనించిన మారుతి మాత్రం సినిమాల్లో నటిస్తావా? అని అడిగారట. అంటే ఇతని మనసును మారుతి గుర్తించారన్నమాట. హీరోగా నటిస్తున్నానని తెలిసినప్పడు శ్రీ ఆనందానికి అవధుల్లేవట. 

మరింత సమాచారం తెలుసుకోండి: