క్యూట్ హీరోయిన్ సమంతకు ఉన్న తెలివి మన దక్షిణాది సినిమా రంగంలో మరే హీరోయిన్ కు లేవు. అభిమానుల నాడి పట్టుకోవడంలోనే కాదు టాప్ హీరోలను కూడ ఒక ఆట ఆడించడంలో సమంతదే పై చేయి.. తన మార్కెట్ గురించి ఎప్పటికప్పుడు ప్లాన్ చేసుకుంటూ ముందుకెళ్తుంది హీరోయిన్ సమంత. తెలుగు, తమిళంలో బిజీగావున్న ఈ బ్యూటీ ఇప్పుడేమో మాలీవుడ్‌పై కన్నేసింది అనే వార్తలు వినపడుతున్నాయి. తెలుగు, తమిళంలో మూడేసి సినిమాలతో బిజీగావున్న సమంత మలయాళ సినిమా రంగంలో అవకాశాలు వెతుక్కోవడం ఇప్పుడు కోలీవుడ్ మీడియాకు హాట్ న్యూస్ గా మారింది. నిన్నటిదాక తన సొంత ఊరు చెన్నై అని చెప్పిన సమంత ఇప్పుడు తన మాట మార్చి తన ఫ్యామిలీ విషయాలను కొన్నింటిని బయటపెట్టింది. తనది కేరళ అంటూ మీడియాకు లీకులివ్వడం మొదలుపెట్టింది. అంతేకాదు తన సొంతూరు కేరళలోని ఆలప్పులం అంటూ వెల్లడించింది. తన తల్లిది కేరళా అనీ తన తండ్రిది మాత్రం తమిళనాడు అంటు ఒక కొత్త కధను తెర పైకి తెచ్చింది సమంత. టాలీవుడ్, కోలీవుడ్ లతో పోలిస్తే మాలీవుడ్ లో హీరోయిన్స్ కు పారితోషికం చాల తక్కువ. అటువంటి సందర్భంలో కోట్ల మీద పారితోషికం పుచ్చుకుంటున్న సమంతకు ఇంత హఠాత్తుగా మాలీవుడ్ గుర్తుకు రావడం తన సొంత ఊరు పేరును మీడియాకు లీక్ చేయడం వెనుక ఎదో ఒక సీక్రెట్ ఉంది అంటు కోలీవుడ్ మీడియా రాతలు రాస్తోంది.   

మరింత సమాచారం తెలుసుకోండి: