హన్సిక త్వరలో స్కూలుకెళ్ళబోతోంది. అందుకోసం ఆమెకు యూనిఫారమ్లు కూడా కుట్టించుకుంటున్నారు. నిజ జీవితంలో కరెస్పాండెన్స్ లో కోర్సులు చేస్తున్న హన్సిక యూనిఫారమ్ లు సిద్ధం చేసుకుంటోంది సింగమ్ 2 సినిమా కోసం. ఇందులో సూర్య సరసన తొలిసారి హన్సిక నటిస్తోంది. అనుష్క, హన్సిక కలిసి కూడా తొలిసారి నటిస్తున్నారు.  ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. తెలుగులో యముడిగా విడుదలై ఘన విజయం సాధించిన సినిమాకు ఇది సీక్వెల్. సీక్వెల్స్ ను మన వాళ్ళు అంతగా ఆదరించని ఈ రోజుల్లో సింగమ్ సీక్వెల్ కు ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: