హన్సిక - నయనతారల మధ్య కోల్డ్‌వార్ ఓపెన్ వార్ గా మారిపోయింది. కోలీవుడ్ మీడియా నిండా వీరిద్దరి గొడవలకు సంబందించిన వార్తలే హడావిడి చేస్తున్నాయి. శివ మెత్తిన సివంగి లా హన్సిక మీడియా సాక్షిగా నయనతార తనకు అస్సలు పోటీయే కాదంటూ తేల్చిచెప్పేసింది. డ్యాన్స్, యాక్టింగ్ ఇలా అన్నింటిలోనూ ఆమె వీక్ అంటూ ఒక్క ముక్కలో తేల్చేసి నయన్ మైండ్ బ్లాంక్ చేసింది హాన్సిక. అంతేకాదు వయసులో తనకన్నా ఆమె పెద్దదంటూ సెటైర్లు వేస్తోంది. ఈ వ్యవహారం ఇంతటితో ఆగకుండా ఒక బహిరంగ పోటీకి సవాల్ విసిరింది హన్సిక. తమ ఇద్దరికీ ఒకే కలర్ డ్రెస్ వేస్తే ఎవరు అందంగా వుంటారో మీకే తెలుస్తుందంటూ మీడియా ముందు చిందులు వేస్తోంది హన్సిక. వీళ్లిద్దరి మధ్య అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరినట్లు కోలీవుడ్‌లో చర్చించుకుంటున్నారు. ఇటీవలకాలంలో హన్సికకు అవకాశాలు వచ్చినట్లే వచ్చి చేజారి పోతున్నాయి. వాటిలో రెండు సినిమాలను నయనతార దక్కించుకోవడంతో పాటు శింబుకు నయనతార దగ్గరకావడం కూడా హన్సిక కోపానికి కారణమైందని అంటున్నారు. మరి హన్సిక వ్యాఖ్యలపై నయనతార స్పందిస్తుందా లేదంటే హన్సికవి పిల్ల చేష్టలు అంటు తెలివిగా కొట్టి పడేస్తుందా అనే విషయం కొద్ది రోజులలో తేలిపోతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: