స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున ‘రుద్రమదేవి’ సినిమాలో చేయబోయే గోనగన్నారెడ్డి పాత్రను దర్శకుడు గుణశేఖర్ హాలీవుడ్ సినిమాలలోని రాబిన్ హుడ్ పాత్ర రీతిలో మలుస్తున్నాడని టాక్. రాణి రుద్రమ కాకతీయ సామ్రాజ్యం పై తిరుగుబాటు చేసి వీరనారి రుద్రమ్మకే వణుకుపుట్టించిన గోనగన్నారెడ్డి గురించి ఇప్పటికీ చరిత్రకారులు చెప్పే కధనాలు వినడానికి విచిత్రంగా ఉంటాయి. రుద్రమదేవి సినిమాలో ఈ పాత్ర కనిపించేది కేవలం 20 నిముషాలే అయినా అత్యంత ప్రాధాన్యతో కూడుకున్న పాత్ర ఇది. ఎప్పటి నుంచో అల్లుఅర్జున్ కు ‘మగధీర’ లాంటి సినిమాలో నటించి మెప్పించాలి అన్న కోరికతో ‘బద్రీనాద్’ సినిమాలో నటించినా ఆ సినిమా విజయవంతం కాకపోవడంతో బన్నీ కోరిక తీరని కోరికగానే మిగిలి పోయింది. ఈ నేపధ్యంలో అనుకోని అవకాసం ‘రుద్రమదేవి’ లో రావడంతో బన్నీ ప్రస్తుతం మంచి జోష్ మీద ఉన్నాడని టాక్. అప్పుడే ఈ సినిమా కోసం అల్లుఅర్జున్ గుర్రపు స్వారీ, కత్తి యుద్దాలలో ప్రత్యేక శిక్షణ కూడ తీసుకుంటున్నాడని తెలుస్తోంది. బన్నీ పాత్రకు సంబంధించిన షూటింగ్ జూలై నెలలో ప్రారంభించి అదే నెలలో పూర్తి చేస్తారట. ‘బాహుబలి’ కోసం ప్రభాస్ కష్టపడి కత్తి యుద్దాలు చేస్తూ ఉంటే ప్రభాస్ కన్నా ముందుగానే బన్నీ తన కత్తి యుద్దాలతో మెగా కుటుంబం ప్రతి విషయంలోనూ ముందు ఉంటుంది అని మరొకసారి రుజువు చేయబోతున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: