కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి తరువాత హీరోగా మారిన సునీల్ సూపర్ స్టార్ రజినీకాంత్ కు షాక్ ఇచ్చాడు అంటే ఎవరూ నమ్మరు. కానీ రజినీకి ఒక విచిత్రమైన షాక్ సునీల్ నిజంగానే ఇచ్చాడు. రజనీకాంత సినిమాలకు జపాన్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. ‘ముత్తు’, ‘భాషా’ తో మొదలై లేటెస్ట్ ‘కొచ్చాడియాన్’ వరకు రజనీ సినిమాలు అన్నీ జపాన్ భాషలోకి డబ్ చేయపడ్డాయి.  ఈమధ్య కాలంలో జపాన్ ప్రజలు జూనియర్ డాన్స్ లను ఇష్టపడుతూ ఉండటంతో జూనియర్ సినిమాలను కూడ కొంతమంది జపాన్ సినిమా నిర్మాతలు జపాన్ భాషలోకి డబ్ చేస్తున్నారు అనే వార్తలు వచ్చాయి. ఇది చాలదు అన్నట్లుగా తాజాగా సునీల్ హీరోగా రూపొందిన మర్యాద రామన్న చిత్రాన్ని సైతం అక్కడ డబ్ చేస్తున్నారు. సునీల్ కామెడీని అక్కడ జనాలు ఎంజాయ్ చేయటానికి ఇష్టపడుతున్నారట. ఈ సినిమా కనుక హట్ అయితే మరిన్ని సునీల్ చిత్రాలు అక్కడికి డబ్బింగ్ అయ్యే అవకాసం ఉంది అని అంటున్నారు. ఇప్పటికే రాజమౌళి దర్శకత్వం వహించిన ‘మర్యాదరామన్న’ బాలీవుడ్, కోలీవుడ్ లలో కూడ రీమేక్ చేయబడి సూపర్ హిట్ కలక్షన్స్ ను అందుకుంది.  ఒక కమెడియన్ సినిమాకు రజినీకాంత్ సినిమాల స్థాయిలో జపాన్ లో అభిమానులు ఉండటం సునీల్ కు అదృష్టం అయితే సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానులకు షాకింగ్ న్యూస్ అని అనుకోవాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: