ఒక రియాలిటీ షోలో తమన్నా కట్టుకున్న చీర కోసం ఇద్దరు హీరోలు పోటీ పడటం హాట్ న్యూస్ గా మారింది ఇటీవల ముంబైలోని ఒక టీవీ షో లో ఈ సంఘటన జరిగింది. దీనితో ఈ షోను చూస్తున్న వారు షాక్ అయ్యారు. బాలీవుడ్ హీరోలు రిటేశ్ దేశ్‌ముఖ్, సైఫ్ ఆలీఖాన్ ఇద్దరూ తమన్నా ముందు చీరలు కట్టుకుని తెగ హడావిడి చేసారు. అంతేకాదు తమన్నా చీర కోసం ఈ ఇద్దరు హీరోలు పోటీ పడటం ఆ షోను చూస్తున్న వారికి కొద్దిగా వెగటు అనిపించింది. అయితే ఈ విషయలేమి పట్టించు కోకుండా తమన్నా చీర కోసం పోటీ పడుతున్న హీరోలను చూసి ఆ షోకు వచ్చిన తమన్నా తెగ ఎంజాయ్ చేసింది.  మిల్కీ బ్యూటీ తమన్నా తెలుగు తమిళ సినిమాలలో నటిస్తున్నా బాలీవుడ్ లో తన స్థాయి పెంచు కోవడం కోసం ఇలా రియాలిటీ షోలలో హడావిడి చేస్తోంది. ఈ వార్తలు ఇలా ఉండగా తమన్నా దర్శకుడు సాజిత్ ఖాన్ తో  ప్రేమాయణం  నడుపుతోంది అన్న వార్తల పై స్పందిస్తూ సాజిత్ ఖాన్ తనకు అన్నయ్య లాంటి వాడని మీడియా సాక్షిగా చెప్పి బాలీవుడ్ మీడియా మైండ్ బ్లాంక్ చేసింది.  దీనితో తమన్నా సాజిద్ తో లిఫ్ట్ లో రొమాన్స్ చేసింది అనే వార్తలు వ్రాసిన బాలీవుడ్ మీడియా ఏమి అనాలో తెలియక బుర్ర పీక్కుంటోoదని టాక్.   

మరింత సమాచారం తెలుసుకోండి: