రానా తొలి చిత్రం ‘లీడర్’ కి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. కృష్ణం వందే జగద్గురుం ఆడియో వేదికపై రానా ‘‘మంచి తెలుగు సినిమా చేయకపోవడమే నన్ను ప్రేక్షకులు గుర్తించకపోవడానికి కారణం అని తాతయ్య అన్నారు’’ అని చెప్పాడు. అంటే శేఖర్ కమ్ముల తీసిన ‘లీడర్’ను రామానాయుడు తెలుగు సినిమాగా గుర్తించలేదా? తెలుగు, తమిళ్ రెండు నేటివిటీలకు తగ్గట్టుగా క్రిష్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ఎలా అసలు సిసలైన తెలుగు సినిమా అవుతుంది  తనకు తెలుగుతనంతో సినిమా తీయడమే ఇష్టమని పదే పదే చెప్తున్న శేఖర్ కమ్ములని దగ్గుబాటి ఫ్యామిలీ అవమానించిందా? లేక గడచిపోయిన విషయాన్ని వదిలేసి తాజా దర్శకుడిని కాకా పడుతోందా? అని సినిమా వర్గాలు చెవులుకొరుక్కుంటున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: