మంచు మోహన్ బాబు సంతానంలో క్షణం తీరికలేకుండా బిజీగా ఉన్నది మంచు లక్ష్మినే. ఓ వైపు సినిమాలను నిర్మిస్తూ, మరో వైపు నటిస్తూ, ఇంకో వైపు బుల్లితెర వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ, మరోవైపు గృహిణిగా, తండ్రికి గారాలపట్టిగా బహుముఖ ప్రతిభను కనబరుస్తోంది మంచు లక్ష్మి. రామ్ గోపాల్ వర్మ నుంచి మణిరత్నం వరకు ఏస్ డైరక్టర్లందరూ ఆమెతో పనిచేయాలనుకుంటున్నారంటే కారణం ఆమెలోని నటనా ప్రతిభే. తండ్రిలోని డైలాగ్ డెలివరీని పుణికిపుచ్చుకుని సినిమా పరిశ్రమ మేల్ డామినేటెడ్ కాదు.  ఫీమేల్స్ కు కూడా ఇక్కడ అందుకునే ఎత్తులు బోలెడన్ని ఉన్నాయని నిరూపిస్తోంది లక్ష్మి మంచు. ప్రస్తుతం గుండెల్లో గోదారిలో నటిస్తూ నిర్మిస్తోంది లక్ష్మి. సోమవారం పుట్టినరోజు నిర్వహించుకుంటున్న లక్ష్మి మరెన్నో ఎత్తులు చేరుకోవాలని ఆశిద్దాం. 

మరింత సమాచారం తెలుసుకోండి: