నటి సమంత మళ్లీ వివాదాల్లో చిక్కుకోబోతోంది అనే సంకేతాలు అందుతున్నాయి. ప్రస్తుతం తమిళ తెలుగు సినిమా రంగాలను క్వీన్ గా ఏలుతున్న ఈ మాయలేడి గతoలో తాను చేసిన విమర్శల సుడిగుండంలో ఇప్పుడు ఆమె చిక్కుకోవడం మీడియాను ఆశ్చర్య పరుస్తోంది. లేటెస్ట్ గా సమంత ‘అన్‌జాన్’లో హీరో సూర్యతో నటిస్తున్న ఒక బీచ్‌ సన్నివేసంలో ఆమె చూపెడుతున్న హాట్ లుక్స్ కు సంభందించి ఆమె కెమేరాకు ఇచ్చిన పోజులు ఆమెను వివాదాలలోకి నెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. పైన కనిపిస్తున్న ఈ చిత్రంలో సమంత పడిపోయిన చెట్టు కాండం మీద అలవోకగా మినీ స్కర్ట్‌లో నడుం వాల్చినప్పుడు ఆమె కాలిపై సూర్య తన చేతిని ఉంచిన దృశ్యం కనిపిస్తోంది. అయితే ఇది ‘ నేనొక్కడినే ’ మూవీలో మహేష్ బాబు, హీరోయిన్ క్రితి సనన్‌ల పోస్టర్‌కి పూర్తి ఆపోజిట్ సీన్ అనుకోవాలి. ఆ పోస్టర్‌లో హీరో మహేష్ వెనుక హీరోయిన్ క్రితిసనన్ ముని కాళ్లపై పాకుతూ వచ్చిన సీన్ కు సంబంధించిన పోస్టర్స్ పై సమంత పెద్ద రచ్చ చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆ పోస్టర్ మహిళలను కించపరిచేలా ఉన్నాయని ఆమె తన ట్విటర్ లో అభిప్రాయాలను పెట్టి మహేష్ అభిమానుల కోపానికి టార్గెట్ అయింది. దీనిపై అప్పట్లో పెద్దయెత్తున చర్చలు కుడా జరిగాయి. మరి ఇప్పుడు హీరో సూర్య సమంత పాదాలు తాకుతూ కనిపిస్తున్నఈ పోస్టర్ పురుషుల ఆత్మా గౌరవాన్ని కించ పరిచే విషయంగా ఉందన్న విషయం సమంతకు తెలియదా అంటూ అప్పుడే వ్యాఖ్యలు కుడా మొదలయ్యాయి.  ‘అన్‌జాన్’ మూవీలో సమంతకు సంబంధించిన ఈ పోస్టర్ గోవాలోని ఓ బీచ్‌లో సమంత, సూర్యల బీచ్ సాంగ్ సీన్ కు సంభందిoచింది. దీనిపై మళ్ళి గట్టి వివాదాలు రావడమే కాకుండా దీనిపై మహేష్ బాబు అభిమానులు మళ్లీ సమంతను టార్గెట్ చేసి తీరుతారు అని అంటున్నారు విశ్లేషకులు. ఏమైనా ఈ పోస్టర్ మరో రగడకు తెర తీయడం ఖాయం.  

మరింత సమాచారం తెలుసుకోండి: