టాలీవుడ్ యంగ్ హీరోల జంటలలో ఉపాసన రామ్ చరణ్ జంట చూడ ముచ్చటగా ఉంటుందని ఈ జంటను చూసిన వారు ఎవరైనా అంటారు. రామ్ చరణ్ భార్యగానే కాకుండా ఉపాసనకు ఒక అరుదైన వ్యక్తిత్వం ఉంది. కామినేని వారి ఆడబడుచుగా ఆమె వ్యాపార రంగంలో కూడ చాల విజయాలు సాధిస్తోంది. లండన్ లో గ్లోబల్ బిజినెస్ మార్కెటింగ్ మేనేజ్ మెంట్ లో డిగ్రీ చేసిన ఉపాసన కేవలం చరణ్ భార్యగా మాత్రమే కాకుండా తన ఫ్యామిలీ నిర్వహిస్తున్న హెల్త్ కేర్ బిజినెస్ లో ఉత్సాహంగా పాల్గొంటూ అనేక విజయాలు సాధిస్తోంది ఉపాసన. చిన్ననాటి నుండి ధైర్యంతో పాటు వ్యక్తిత్వాన్ని పెంచుకున్న ఉపాసన ఈ మధ్యన ఒక ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చరణ్ తో నడిచిన తన ప్రేమ కధను షేర్ చేసుకుంది.  చిన్న నాటి నుండి పరిచయమున్న రామ్ చరణ్ తనకు మొత్తం మూడు సార్లు ప్రేమను ప్రపోజ్ చేసాడు అని చెప్పింది. అంతేకాదు మొట్టమొదటిసారి తన తల్లితండ్రులు మరియు ఫ్రెండ్స్ ముందు తన ప్రేమను ఓపెన్ గా వ్యక్తపరిచినప్పుడు తాను చాల షాక్ అయ్యాను అని చెపుతూ ఆనాడే చరణ్ ముక్కు సూటిగా మాట్లాడే మనస్తత్వానికి ఫిదా అయిపోయానని ఆనాటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంది మగధీరుడి భార్య. చరణ్ కు అమ్మాయిలలో ఉన్న క్రేజ్ గురించి మాట్లాడుతూ తన అపోలో హాస్పటల్ లో పనిచేసే అమ్మాయిలు అంతా చరణ్ గురించి గొప్పగా చెపుతూ ఉంటే ఒకొక్కసారి అభిమానం మరొకసారి జలసీ తనకు చరణ్ పై ఏర్పడతాయని జోక్ చేసింది ఉపాసన. తాను బిజినెస్ లో చాలా బిజీ గా ఉన్నా తనకు వంట అంటే ఎంతో ఇష్టమని చెపుతూ తానువంటలతో ప్రయోగాలు చేస్తూ ఆ వంటలను తినమని చరణ్ ను బలవంత పెడితే ఏమి అనలేక తన వంట ప్రయోగాలను ప్రేమతో భరించే మంచి భర్త రామ్ చరణ్ అని అంటోంది ఉపాసన. చరణ్ తో తన ప్రేమ వ్యవహారం పెళ్లి పీటలవరకు రావడానికి తన పిన్ని సహకారం వల్లే జరిగిందని తన పిన్ని సపోర్ట్ లేకపోతే చరణ్ తో తన పెళ్లి జరిగి ఉండేది కాదని అభిప్రాయపడుతూ తన జీవితంలో సాధించిన విజయాలకు తన తల్లిదండ్రులు, గ్రాండ్ పెరెండ్స్, పిన్ని ఇచ్చిన ప్రోత్సాహం వల్లే తాను నిలబడ్డానని చెప్పుకొచ్చింది ఉపాసన. తన ఉత్సాహాన్ని చూసి ఇంప్రెస్ అయిన తన తాతయ్య, అపోలో హాస్పిటల్స్ సీఈఓ డా.ప్రతాప్ సి రెడ్డి 2008లో తనను అపోలో ఫిలాంత్రఫీ విభాగానికి వైస్ ప్రెసిడెంట్‌ని చేశారని చెపుతూ అపోలో ఫిలాంత్రఫి విభాగానికి చెందిన వైస్ ప్రెసిడెంట్ హోదాలో చాలా చోట్ల మారుమూల పల్లెల్లో హెల్త్ క్యాంప్‌లు నిర్వహించానని చెపుతూ ఇటీవలే లాటిట్యూడ్స్ జిమ్‌ని చేజిక్కుంచుకున్న తాను హెల్త్ అండ్ ఫిట్ నెస్‌పై ప్రజల్లో మరింత అవగాహన కల్పిస్తూ మరిన్ని జిమ్స్‌ని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నానని చెప్పుకొచ్చింది. ఇన్ని పనులు చేస్తున్నా చరణ్ ప్రతి విషయంలోనూ తన వెన్నంటి ఉంటాడని చెపుతూ తమ ఇద్దరి భావాలు కోరికలు ఆశయాలు ఒకే విధంగా ఉండటంతో తమ ఇద్దరి మధ్య ప్రేమ రోజురోజుకు పెరుగుతోంది కాని తరగడం లేదు అని తమ లవ్ సీక్రెట్ బయట పెట్టింది ఉపాసనా రామ్ చరణ్.  

మరింత సమాచారం తెలుసుకోండి: