ఈరోజు ఉదయం ఒక ప్రముఖ జాతీయ ఇంగ్లీష్ దిన పత్రిక తెలవారకుండానే మహేష్ కు జోష్ పవన్ కు షాక్ ఇచ్చింది. ఎంతోమంది ఆశక్తిగా ఎదురు చూస్తున్న 61వ ఫిలిం ఫేర్ అవార్డుల లిస్టును ఆ పత్రిక సైట్ లో పెట్టింది. మరోసారి మహేష్ కు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలోని నటనకు ఉత్తమ నటుడి అవార్డు దక్కింది. ఈసారి ఒక వైపు పవన్ తన ‘అత్తారింటికి దారేది’ సినిమాతో మహేష్ కు గట్టి పోటీ ఇచ్చినా చివరకు అవార్డు మాత్రం మహేష్ సొంతం కావడం అందర్నీ ఆశ్చర్య పరిచింది. అయితే ఉత్తమ చిత్రం అవార్డు మాత్రం పవన్ ‘అత్తారింటికి దారేది’ సినిమాకు దక్కడంతో పవన్ మహేష్ ల మధ్య పోటీలో ఇద్దరు సమ ఉజ్జీలుగానే నిలిచారు అని అనుకోవాలి. అదేవిధంగా అందరి అంచనాలను తల క్రిందులు చేస్తూ ఉత్తమ నటిగా నిత్యామీనన్ ‘గుండెజారి గల్లంతైయిందే’ సినిమాకు అవార్డు వచ్చింది. అదేవిధంగా నయనతారకు కోలీవుడ్ బెస్ట్ హీరోయిన్ గా అవార్డు దక్కితే, ప్రస్తుతం టాలీవుడ్ లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ‘దృశ్యం’ సినిమా మలయాళంలో ఉత్తమ సినిమాగా ఎంపిక అయింది. ఈ వార్తలు ఇలా ఉండగా జరగబోతున్న ఫిలిం ఫేర్ అవార్డ్స్ నైట్ లో చొట్ట బుగ్గల సుoదరి తాప్సీ ఒక స్పెషల్ సాంగ్ ను చేస్తూ ఈ అవార్డు ఫంక్షన్ కు తన అందాలతో కొత్త మెరుపు ఇవ్వబోతోంది. ‘వన్’ సినిమా పరాజయంతో షాక్ కు గురైన మహేష్ కు ఈ అవార్డు మంచి జోష్ ను ఇవ్వడమే కాకుండా రాబోతున్న ‘ఆగడు’ కు మరింత క్రేజ్ ను పెంచుతుంది.   

మరింత సమాచారం తెలుసుకోండి: