అవినీతికి చాలా దూరంలో ఉండే నందమూరి కుటుంబహీరో జూనియర్ కరప్టెడ్ గా మారిపోయాడు అంటే ఎవ్వరూ నమ్మరు. అయితే నిజజీవితంలో కాకపోయినా వెండి తెరపై జూనియర్ ఎన్టీఆర్ కరప్టెడ్ గా కనిపించబోతున్నాడు. ఎపి హెరాల్డ్ కు అందుతున్న సమాచారం మేరకు త్వరలో ప్రారంభంకాబోతున్న జూనియర్ ఎన్టీఆర్, పూరి జగన్నాథ్ ల కొత్తసినిమాకు ‘నేనోరకం’ అన్న టైటిల్ కు ‘టోటల్లీ కరప్టెడ్’ అనే ట్యాగ్‌లైన్ తో జూనియర్ ఓటు వేసినట్లు వార్తలు వస్తున్నాయి.  గతంలో ఇదే సినిమాకు సంభందించి ‘కుమ్మేస్తా’, ‘టెంపర్’ అనే టైటిల్స్ ప్రచారం లోకి వచ్చిన సంగతి తెలిసిందే. టైటిల్ చిన్నగావుంటే ఆసినిమా సూపర్ హిట్ అవుతుందనే పూరి సెంటిమెంట్‌తో జూనియర్ కొత్త సినిమాకు ఈ టైటిల్ ను పూరి ఆలోచించి నిర్ణయం చేయడమే కాకుండా తన సెంటిమెంట్ ను జూనియర్ కు వివరించి ఈటైటిల్ కు జూనియర్ ఒప్పుకునేలా చేసాడు అని ఫిలింనగర్ టాక్.  ఆగష్టు ఫస్ట్‌వీక్‌లో సెట్స్ పైకెళ్లే ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తయ్యాయి అని అంటున్నారు. దర్శకుడు పూరి కొత్తగా నిర్మించుకున్న అధునాతన స్వంత ఇల్లు ‘కేవ్’ లో ఈ సినిమాను ప్రారంభించడమే కాకుండా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ముఖ్య సన్నివేశాలు షూట్ చేయబోతున్నారని ఫిలిం నగర్ సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: