సీనియర్ నటుడు సాగిరాజు రాజంరాజు (ముక్కు రాజు) మరణించారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. రాజంరాజు (ముక్కు రాజు) 1000కి పైగా సినిమాల్లో ఆయన నటించారు. కొరియోగ్రాఫర్ గా సినీ రంగంలో ప్రవేశించిన ఆయన, పలు చిత్రాలలో అనేక పాత్రలు పోషించారు. పశ్చిమగోదావరి జిల్లా భీవరం దగ్గర కుముదపల్లిలో 1931లో ఒక వ్యవసాయ కుటుంబంలో ముక్కురాజు జన్మించారు. తండ్రి బాపిరాజు, తల్లి సత్యవతమ్మ. 1941 క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా ఈ ఇంగ్లీష్ చదువులు మాకొద్దు అంటూ పుస్తకాలు విసిరేసి చదువు మానేసారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం పాలకొండి మండలం కుమటి గ్రామంలో తుదిశ్వాస విడిచారు. ముక్కురాజు అసలుపేటు సాయిరాజు రాజంరాజు. 2010లో వచ్చిన '1940లో ఓ గ్రామం' అనే చిత్రంలో నటించిన ముక్కురాజుకు జాతీయ స్థాయి అవార్డు లభించింది. 2013 ముక్కురాజు చివరి సారిగా ‘మధసింహం' అనే చిత్రంలో నటించారు. ఆర్. నారాయణమూర్తి తీసే సినిమాల్లో దాదాపు ప్రతి దాంట్లోనూ ముక్కురాజు కనిపించే వారు. ముక్కురాజు మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆయన స్వస్థలమైన పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడలో శుక్రవారం నాడు ముక్కురాజు అంత్యక్రియలు జరుగుతాయి. 200 సినిమాలకు డాన్స్ మాస్టర్ గా పని చేసారు. నందమూరి తారక రామారావుకు వ్యక్తిగత డాన్స్ మాస్టర్‌గా కూడా పని చేసారు. చిరంజీవి ప్రాణం ఖరీదు, పునాది రాళ్లు, మనవూరి పాండవులు చిత్రాలకు డాన్స్ మాస్టర్ గా పని చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: