ఒక వైపు టాలీవుడ్ కోలీవుడ్ లలో క్షణం తీరిక లేకుండ స్వీటి అనుష్క సినిమాలు చేస్తూ ఉంటె అదే వేగంతో ఆమె పై ప్రేమ రూమర్స్ వరుస పెట్టి వస్తూ ఉండటం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. లేటెస్ట్ గా ఈ యోగా బ్యూటీని కోలీవుడ్ దర్శకుడు లింగు స్వామిని ఈ ప్రేమ వ్యవహారంలో ఇరికిస్తూ కోలీవుడ్ మీడియా వార్తలు రాస్తోంది. దీనికి కారణం కొద్ది రోజుల క్రితం దర్శకుడు లింగు స్వామి ‘అంజాన్’ ఆడియో వేడుకలో అందరి సాక్షిగా అనుష్క పై తన ప్రేమను వ్యక్త పరుస్తూ చేసిన ఓపెన్ కామెంట్. ఈ కామెంట్ తరువాత కోలీవుడ్ మీడియా మరింత రెచ్చిపోయి అనుష్కకు, లింగు స్వామికి మధ్య ఎదో నడుస్తోంది అంటూ చాల ఘాటుగా మీడియా రూమర్లు రాస్తోంది. ఇద చాలదు అన్నట్లుగా రెండు రోజుల క్రితం హైదరాబాద్ లో జరిగిన ‘అంజాన్' తెలుగు వెర్షన్ ‘సికిందర్' ఆడియో వేడుక సందర్భంగా లింగు స్వామి రాజమౌళిని ఉద్దేసించి అనుష్క పక్కన ఒక షాట్లో నటించే అవకాశం ఇప్పించాలని కోరాడు.  దీంతో లింగు స్వామి నిజంగానే అనుష్క తో పీకల లోతులో ప్రేమలో పడిపోయాడు అంటూ వస్తున్న వార్తలకు మరింత బలం చేకూరింది అంటూ వరస పెట్టి వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలతో సంబందం లేకుండా అనుష్క మాత్రం వరస పెట్టి కొత్త సినిమాలు ఒప్పుకుని తన హవాను కొనసాగిస్తూనే ఉంది. దీనితో అనుష్క పై లింగు స్వామి ప్రేమ వన్ సైడ్ లవ్వా? అనే సెటైర్లు పడుతున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: