ఆస్కార్ అవార్డు గ్రహీత సుప్రసిద్ధ హాలీవుడ్ హాస్యనటుడు రాబిన్ విలియమ్స్ ఆత్మహత్య చేసుకోవడం అమెరికా అధ్యక్షుడు ఒబామా దగ్గర నుంచి విలక్షణ నటుడు కమలహాసన్ వరకు ఎందరినో షాక్ కు గురిచేసింది. ప్రతి విషయం పై స్పందించే సమంతను కూడ రాబిన్ విలియమ్స్ మరణం షాక్ కు గురిచేయడమే కాకుండా ఏకంగా ఆయన మరణం సమంత కంట కన్నీరు పెట్టించింది. రాబిన్ విలియమ్స్ మరణ వార్త తెలిసిన దగ్గర నుంచి తాను బెంగతో తల్లడిల్లి పోతున్నానని అనుక్షణం ఆ నటుడి గురించి ఆలోచిస్తూ ఉండటంతో తన మనసు తల్లడిల్లిపోతోందని అంటూ తనకు ఈ వార్త తెలిసిన దగ్గర నుంచి బెంగతో ఆకలి కూడ వేయడంలేదు అంటూ తన ఫేస్ బుక్ లో తన బాధను తన అభిమానులతో పంచుకుంటోంది.  అంతేకాదు సమస్యలు ఎదురైతే ధ్యైర్యంగా ఎదిరించాలి కాని ఇలా పిరికిపందలా ఆత్మహత్య చేసుకోవడం ఏమిటని ఏకంగా చనిపోయిన ఆ మహానటుడునే టార్గెట్ చేస్తోంది సమంత. ప్రపంచ వ్యప్తంగా కోట్లాదిమంది అభిమానులతో పాటు ఐదు సార్లు గ్రామీ అవార్డులను అందుకున్న రాబిన్ విలియమ్స్ ఆత్మహత్య పైనే కామెంట్స్ చేసే స్థాయికి సమంత ఎదిగిపోవడం బట్టి సమంత ఎవరిపైన అయినా ఏవిషయం పైన అయినా తన ఫేస్ బుక్, ట్విటర్ ద్వారా భారీ కామెంట్లు చేయగల సమర్దురాలని సమంత మరోసారి రుజువు చేసుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: