తన క్రేజ్ తో దక్షిణాది సినిమారంగాన్ని ఏలుతున్న క్యూట్ బ్యూటీ సమంత తన సినిమాలకు కోట్లాది రూపాయలను పారితోషికంగా తీసుకోవడమే కాకుండా తనను అతిధిగా పిలిచిన ఫ్యాషన్ షో నిర్వాహకులకు నిముషానికి ఐదు లక్షలు చొప్పున వసూలు చేస్తూ మరో కొత్త రికార్డును క్రియేట్ చేసింది. క్రేజ్ ఉండగానే కోట్లు వెనకేసుకావాలన్న సిద్దాంతం సమంతకు తెలిసినంతగా మరొక హీరోయిన్ కు తెలియదు అన్నది వాస్తవం. గతవారం భాగ్యనగరంలో జరిగిన సూరత్ మిల్స్ శారీ ఫ్యాషన్ షోలో పాల్గొన్న సమంత ఆ కార్యక్రమానికి వచ్చినందుకు ఒక రేటు తీసుకుంటే ఆ ఫ్యాషన్ షో స్టేజ్ పై ర్యాంప్ వాక్ చేసినందుకు నిముషానికి ఐదు లక్షలు చొప్పున ఆ షో నిర్వాహకుల నుండి పిండేయడం టాలీవుడ్ సంచలనంగా మారింది.  దీనితో సమంత అందమైన పింక్ కలర్ శారీతో ర్యాంప్ వాక్ చేసినందుకు కేవలం రెండు నిముషాలకు అక్షరాలా 10 లక్షలు తీసుకుని తాను దక్షిణాది సినిమా రంగ క్వీన్ అని మరోసారి నిరూపించుకుంది. రోజురోజుకు పెరిగి పోతున్న సమంత క్రేజ్ తో ఆమె పారితోషికం కూడ ఇలా చుక్కలు తాకుతూ భవిష్యత్ లో ఏ స్థాయికి చేరుతుందో అనే ప్రశ్న నిర్మాతలను షేక్ చేస్తోంది. దటీజ్ సమంత.. 

మరింత సమాచారం తెలుసుకోండి: