బాలీవుడ్ గోల్డెన్ లెగ్ హీరోయిన్ దీపికా పదుకొనే బాలీవుడ్ హీరో రణ్‌వీర్‌సింగ్ తో డేటింగ్ చేస్తున్న విషయం ఓపెన్ సీక్రెట్. అయితే దీపిక స్వయంగా తన ప్రియుడి లోపాలను మీడియాకు వివరించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిజమైన ప్రేమంటే ప్రేమించిన వారి లోపాలను కూడా ఇష్టపడటం అని చేపుతోంది దీపిక. అందుకే రణ్‌వీర్‌సింగ్ కు కొన్ని విచిత్రమైన లోపాలు ఉన్నా తాను అవేమి పట్టించుకోను అని అంటోంది ఈ అందాలరాసి దీపిక. ఇక రణ్‌వీర్‌సింగ్ లోపాల గురించి చెపుతూ ఈ హీరో ‘అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్’తో బాధ పడుతున్నాడు అని చెపుతోంది దీపిక. ఈ వ్యాధి ఉన్నవారు ఊరకే భయపడటం, సౌకర్యంగా ఉండలేకపోవడం, చేసిన పనినే మళ్లీ మళ్లీ చేయడం, అనవసరపు ఆత్రుత ప్రదర్శించడం లాంటి విషయాలు చేస్తూ ఉంటారట. ఈ వ్యాధి లక్షణాలు అన్నీ రణ్‌వీర్‌లో ఉన్నాయి అంటోంది దీపిక. నీట్‌గా ఉన్న దాన్ని మళ్లీ మళ్లీ శుభ్రం చేసుకోవడం, మళ్లీ మళ్లీ చెకింగ్ చేసుకోవడం, తొందరపడిపోవడం, అతిగా ప్రేమించడం, శృంగారం విషయంలో అడ్వాన్స్ అయిపోవడం ఇవన్నీ ఆ వ్యాధి లక్షణాలే అని చెపుతూ లొకేషన్‌లో రణ్‌వీర్ ప్రవర్తన విచిత్రంగా ఉంటుంది అని అంటోంది. షాట్ గ్యాప్‌లో పెర్‌ఫ్యూమ్ కొట్టుకోవడం నిమిషనిమిషానికీ దువ్వెనతో దువ్వుకోవడం చూయింగ్‌గమ్ విపరీతంగా నవలడం లాంటి లక్షణాలతో రణవీర్ చూసేవారికి విచిత్రంగా కనిపించినా తనకు మాత్రం అమాయకుడిలా కనిపిస్తూ చాల నచ్చుతాడని ముసిముసి నవ్వులు నవ్వుతూ దీపిక ఆ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ లో చెప్పడం ఇప్పుడు టాపిక్ ఆఫ్ బాలీవుడ్ గా మారిపోయింది. అయితే ఈ విషయాలు అన్ని బహిరంగంగా ఎందుకు చెప్పిందో దీపికకే తెలియాలి . 

మరింత సమాచారం తెలుసుకోండి: