సమీరా రెడ్డి... అదే.... అప్పుడెప్పుడో తెలుగులో ఒకట్రెండు సినిమాల్లో కనిపించిందే ఆ అమ్మాయే. ఈ మధ్య ‘చక్రవ్యూహ్’ అనే హిందీ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ కి స్టెప్పులేసింది. అవకాశాలు కాస్త తగ్గినప్పుడు ఏ హీరోయిన్ ఐటమ్ సాంగ్స్ చేస్తుండటం సహజమే. ఎలాగూ సమీరా ఐటమ్స్ బాట పట్టింది కాబట్టి... ఆమెతో మరికొన్ని ప్రత్యేక గీతాల్లో నటింపజేద్దామని కొంతమంది నిర్మాతలు సమీరాని సంప్రదించారు. వాళ్లకి ఆమె ఓ షాక్ ఇచ్చింది. ‘నేను చిన్నా చితకా హీరోల... దర్శకుల... నిర్మాతల సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేయను. చేస్తే గీస్తే... పెద్ద హీరోలు... పెద్ద దర్శకులు.. పెద్ద నిర్మాతలకే చేస్తా’ అందిట. చక్రవ్యూహ్ లో చేయడానికీ ఓ కారణం చెప్పంది. అది ప్రకాష్ జా సినిమా కాబట్టి... ఆయనంటే చాలా గౌరవం కాబట్టి చేశానంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: