ఇళయరాజా తనయుడిగా సినిమా రంగంలో సంగీత వారసత్వాన్ని కొనసాగిస్తున్న యువన్ తన తండ్రికి ఇష్టం లేకపోయినా ఇస్లాం మంతంలోకి మారిన సంగతి తెలిసిందే. ఈ విషయమై ఇళయరాజాకు యువన్ ల మధ్య తీవ్ర భేదాభిప్రాయాలు ఏర్పడటంతో యువన్ తన తండ్రి నుండి వేరుపడి వేరుగా ఉంటున్నాడు అనే వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు యువన్ మరో అడుగు ముందుకు వేసి తన పేరును కూడా మార్చుకోబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. వెంకట్ ప్రభు దర్శకత్వంలో సూర్య హీరోగా రూపొందుతోన్న ‘మాస్' చిత్రం ద్వారా యువన్ శంకర్ రాజా తన కొత్త పేరును కోలీవుడ్ కు అదే విధంగా తన అభిమానులకు పరిచియం చేయబోతున్నాడు. కోలీవుడ్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం యువన్ తన పేరును మహ్మద్ యువన్ అని మార్చు కుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.  తన తల్లి మరణం తరువాత తీవ్ర నిరాశలోకి వెళ్ళిపోయిన యువన్ కు ఒక ముస్లిం మిత్రుడు తానూ మక్కాలో ప్రార్థన చేసిన చాపను తనకు ఇచ్చి గుండె భారంగా ఉన్నప్పుడు దీనిపై కూర్చుంటే బెంగ తొలుగు తుందని యువన్ కు చెప్పాడట. ఆ చాపపై కూర్చుని తన తల్లి గురించి ఆలోచిస్తూ ఉంటే తన తల్లి తన చేయి పట్టుకుని ఒంటరిగా ఉన్న తనని ఇస్లాం అనే మహావృక్షం కింద కూర్చోమని సలహా ఇచ్చినట్లు అనిపించిందని అందుకే మతం మారాను అంటున్నాడు ఈ విలక్షణ సంగీత దర్శకుడు.  ఈ పరిస్థుతులలో యువన్ సంగీతం సమకూర్చిన తెలుగు సినిమా ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా తరువాత వచ్చే తెలుగు సినిమాలలో కూడ యువన్ ఈ కొత్తపేరుతో కనిపిస్తాడు అనుకోవాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: