బాలీవుడ్ గోల్డెన్ లెగ్ బ్యూటీ దీపిక పదుకునె హీరో రణ్‌వీర్ సింగ్ తో డేటింగ్ చేస్తున్న విషయం ఓపెన్ సీక్రెట్. అయితే దీపిక ప్రియుడు రణ్ వీర్ సెక్స్ పై చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు బాలీవుడ్ కు హాట్ న్యూస్ గా మారాయి. ఈమధ్య మీడియాతో మాట్లాడిన రణ్‌వీర్ తాను 12 ఏళ్లు వున్నప్పుడే సెక్స్ రుచి ఏంటో చూశాను అని చెప్పడం సంచలనంగా మారింది. అది కూడా తనకన్నా వయస్సులో పెద్దావిడతో తాను సెక్స్ లో పాల్గొన్నానని మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రణ్ వీర్ సగర్వంగా చెప్పుకోవడం ఆశ్చర్యంగా మారడమే కాకుండా ప్రస్తుత సమాజం ఎటు వెళ్ళిపోతోంది అనే అనుమానం ఎవరికైనా వస్తుంది.  ఇటీవల ఒక కండోమ్ బ్రాండ్‌కి అంబాసిడర్‌గా మారిన రణ్‌వీర్ ఒక లీడింగ్ డైలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశాడు. తనకి చిన్నప్పటి నుంచే అన్నీ తొందర అని చెప్పుకున్న రణ్‌వీర్ చివరికి శృంగారాన్ని కూడా అలాగే రుచిచూశానని అంటున్నాడు. రణ్‌వీర్ తల్లితండ్రులు చిన్నప్పటి నుంచి తన పై వస్తున్న కంప్లైంట్స్ కు చికాకు పడి తమకు ఇటువంటి బ్యాడ్ బాయ్ పుట్టాడు ఏమిటీ అంటూ తల పట్టుకునే వారట. బాలీవుడ్ మీడియాలో సంచలనంగా మారిన ఈ లేటెస్ట్ రణవీర్ వ్యాఖ్యలను వింటూ దీపిక ఏమంటుందో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: