రాజమౌళి పుట్టినరోజు సందర్భంగా ఒక ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి అన్న కీరవాణి అనేక ఆశక్తికర విషయాలను బయట పెట్టాడు. రాజమౌళిని తమ ఇంటిలో అందరూ నంది అని పిలుస్తారాని అసలు రాజమౌళికి ఆ ముద్దు పేరు ఎందుకు వచ్చిందో తనకు ఇప్పటికీ తెలియదని ఇదే విషయం తమ ఇంటిలోని పెద్దవారిని అడిగినా క్లారిటీ ఇవ్వలేదని అయితే రాజమౌళిని తమ కుటుంబ సభ్యులు అంత నంది అని పిలవడం పరిపాటి అయిందని ఆశక్తికర విషయం వెల్లడించారు కీరవాణి.  తనకు రాజమౌళికి పన్నెండు ఏళ్ల వయసు వ్యత్యాసం ఉందని అంటూ తాను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు రాజమౌళి ఫస్ట్ స్టాండర్డ్ చదివే వాడని అలనాటి విషయాలు గుర్తుకు చేసుకున్నాడు కీరవాణి. రాజమౌళి సినిమాల విషయంలో పడే కష్టం తనకు ఎంత నచ్చుతుందో రాజమౌళి పెంచుకునే గెడ్డం తనకు అంత చికాకు అని అంటూ ఇదే విషయాన్ని అనేకసార్లు రాజమౌళికి చెప్పినా పట్టించుకోడు అంటూ రాజమౌళి గెడ్డం పై సెటైర్లు వేసాడు కీరవాణి. రాజమౌళి చేసే ప్రతి సినిమాలోను సంగీత దర్శకుడిగా తాను కొనసాగుతున్న విషయం పై క్లారిటీ ఇస్తూ తన సినిమాల విషయంలో తాను బెస్ట్ మ్యూజిక్ ఇస్తాననే నమ్మకంతో రాజమౌళి తనతో అన్ని సినిమాలలో చేస్తున్నాడు కాని తాను రాజమౌళికి అన్నయ్య అనే భక్తి భావంతో తనతో పాటలు చేయించుకోవడంలేదు అంటూ చురకలు వేసాడు కీరవాణి.  సినిమా వరకు తాము అన్నదమ్ములు అన్న విషయాన్నీ మరిచిపోతామని అందర్నీ పిండేసినట్లే తనను కూడా పిండేసే పని రాక్షసుడు రాజమౌళి అంటూ ఈ తెలుగు తెర జక్కన్న గురించి ఎన్నో విషయాలను ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నాడు కీరవాణి.  

మరింత సమాచారం తెలుసుకోండి: