గతవారం దీపావళికి రిలీజ్ అయిన విజయ్ సంచలన చిత్రం ‘కత్తి’ ని పవన్ తో రీమేక్ చేయాలని ‘ఠాగూర్’ మధు రచించిన ప్లాన్ వృధా అయినట్లుగా తెలుస్తోంది. కోలీవుడ్ టాప్ డైరెక్టర్ మురగ దాస్ దర్శకత్వం వహించిన సినిమా కావడంతో ఈ సినిమాలో పవన్ నటిస్తే చూడాలని పవన్ అభిమానులు కూడా చాల ఆశలు పెట్టుకున్నారు. అయితే ఫిలింనగర్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం నిన్న సాయింత్రం ‘కత్తి’ స్పెషల్ షోను చుసిన పవన్ ఈ సినిమా రీమేక్ లో తాను నటించడం అనవసరం అనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీనితో నిర్మాత మధు ‘కత్తి’ డబ్బింగ్ వర్షన్ ను నవంబర్ 21న విడుదల చేయటానికి రెడీ అవుతున్నట్లుగా తన డిస్ట్రిబ్యూటర్స్ కు ఈ విడుదల తేదీని సూచన ప్రాయంగా తెలియచేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు ఇలా ఉండగా కోలీవుడ్ ను షేక్ చేస్తున్న ‘కత్తి’ సినిమా చుట్టూ మరో వివాదం చుట్టుముట్టింది. ‘2జీ సాయంతో కోట్లకు కోట్లు లూటీ చేసిన వ్యక్తులున్న దేశమిది’ అంటూ విజయ్ చెప్పిన డైలాగ్ మరో కొత్త వివాదానికి తెర తీసింది. దేశాన్ని కుదిపేసిన 2జీ కుంభకోణాన్ని ప్రస్తావించిన ఆ డైలాగ్ జాతి ప్రయోజనాలకు, న్యాయవ్యవస్థ గౌరవానికి భంగం కలిగించేలా ఉంది అని అంటూ తమిళనాడుకు చెందిన న్యాయవాది సుబ్రమణియన్ మధురై మేజిస్ర్టేట్ కోర్టులో కేసు వేశారు అనే వార్తలు వస్తున్నాయి. ఇలా ఎన్ని వివాదాలు చుట్టుముట్టుతున్నా కోలీవుడ్ లో ‘కత్తి’ మాత్రం కలెక్షన్స్ వర్షం కురిపిస్తూనే ఉంది...  

మరింత సమాచారం తెలుసుకోండి: