విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ టార్చర్ కు హైదరాబాది బ్యూటీ పూనమ్ కౌర్ విసిగి పోయి వర్మ తీస్తున్న సినిమా నుండి తప్పుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. సినిమా మొదటి పోస్టర్ తోనే వివాదాలు కొనితెచ్చుకున్న ‘సావిత్రి’ ఆ తరువాత ‘శ్రీదేవి’ గా మారింది అన్న విషయం తెలిసిందే. ఒక టీచర్ చుట్టూ తిరిగే ఈ సినిమాలో పూనమ్ కౌర్ నటిస్తోంది. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ సినిమా షూటింగ్ కొద్ది రోజులు జరిగిన తరువాత వర్మ తిక్క తట్టుకోలేక ఈ సినిమా నుండి పూనమ్ కౌర్ తాను తప్పుకుంటున్నట్లుగా వర్మకు సమాచారం అందించింది అని టాక్.  వినపడుతున్న వార్తల ప్రకారం మొదటిగా వర్మ ఈ కథను పూనమ్ కు చెప్పినప్పుడు ఆమెను ప్రేమించే వ్యక్తిగా ఒక టీనేజ్ కుర్రాడు ఉంటాడు అని చెప్పి షూటింగ్ ప్రారంభం అయ్యాక 10 ఏళ్ల వయస్సు గల ప్రణీత్ తో సన్నివేశాలు రామ్ గోపాల్ వర్మ చిత్రీకరించడం మొదలు పెట్టేసరికి ఆ సీన్స్ తట్టుకోలేక తీవ్ర మనస్తాపం చెందిన పూనమ్ కౌర్ ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నట్లుగా వర్మకు తెలియచేసి వర్మ ఫోన్ కు కూడా అందుబాటులో లేకుండా ఆమె తప్పించు కుంటోంది అనే వార్తలు వినిపిస్తున్నాయి.  దీనితో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఆగి పోయింది అనే వార్తల హడావిడి కూడా జరుగుతోంది. అవకాశాలు లేకే ఖాళీగా ఉన్న హీరోయిన్స్ కూడా వర్మ దెబ్బకు పారిపోతున్నారు అంటే ఆ సినిమా ఏ స్థాయిలో ఉందొ ఊహించుకోవచ్చు..  

మరింత సమాచారం తెలుసుకోండి: