నైజాం ఏరియా డిస్ట్రిబ్యూషన్ రారాజుగా టాలీవుడ్ ను ఏలిన దిల్ రాజ్ కు ఈ సంవత్సరం అతడు డిస్ట్రిబ్యూట్ చేసిన సినిమాలు చాలామటుకు ఘోర పరాజయం చెందడంతో టాలీవుడ్ సినిమా రంగంలో దిల్ రాజ్ పని అయిపోయింది అంటూ వార్తలు వచ్చాయి. అంతేకాదు ఇక దిల్ రాజ్ నిర్మాతగా సినిమాలు తీయడు అని కొందరు ఊహగానలు కూడా చేసారు.  అయితే ఆ రూమర్లకు తెర దించుతూ దిల్ రాజ్ మరో భారీ సినిమా నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నాడు అనే వార్తలు ఊపందు కుంటున్నాయి. ఫిలింనగర్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం దిల్ రాజ్ కు బాసటగా జూనియర్ తన స్నేహ హస్తాన్ని అందిస్తున్నాడు అని టాక్. త్వరలో వీరిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా చేయడానికి జూనియర్ అంగీకరించాడని గత సంవత్సరం ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమా ద్వారా ఏర్పడ్డ భేదాభిప్రాయాలను తొలగించుకుని ప్రస్తుతం కాలం కలిసి రాక బాధ పడుతున్న వీరిరువురు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందించబోయే సినిమాకు శ్రీకారం చుడుతున్నారు అనే వార్తల హడావిడి వినిపిస్తోంది.  వినపడుతున్న వార్తల ప్రకారం ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ చురుకుగా జరుగుతున్న ఈసినిమా షూటింగ్ వచ్చే సంవత్సరం ప్రధమార్ధంలో ఉంటుంది అనే టాక్ వినపడుతోంది. ప్రస్తుతం హిట్స్ లేక బాధ పడుతున్న బొమ్మరిల్లు భాస్కర్, జూనియర్, దిల్ రాజ్ లు కలిసి చేస్తున్న ఈ ప్రయోగం విజయవంతం అయితే ఈ ముగ్గురికీ కూడా మళ్ళీ టర్నింగ్ పాయింట్ గా మారుతుంది..  

మరింత సమాచారం తెలుసుకోండి: