బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సన్షేనల్ హిట్ ని సాధించిన సెషల్ 26 ఫిల్మ్ ని సౌత్ లో రిమేక్ చేస్తున్నారు. 2013లో బాలీవుడ్ లో విడుదలైన హిందీ సినిమా ‘స్పెషల్ 26′ సూపర్ హిట్ అవ్వడమే కాకుండా నేషనల్ అవార్డు కూడా గెలుచకుంది. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. తాజా సమాచారం ప్రకారం సౌత్ లోరిమేక్ అవుతున్న ఈ మూవీకి అప్పుడే స్టార్ కాస్టింగ్ ని కూడ ఎంపిక చేసే ప్రక్రియ జరుగుతుంది. ఈ సినిమాని సౌత్ ఇండియన్ అన్ని భాషల్లోనూ తెలుగు, తమిళ్ , కన్నడ, మలయాళం లో రీమేక్ చేయనున్నారు. ఈ స్పెషల్ 26 హిందీ మూవీ రైట్స్ ని తమిళ డైరెక్టర్ త్యాగరాజన్ సొంతం చేసుకున్నాడు. ‘స్పెషల్ 26 ని రీమేక్ చేసే గోల్డెన్ ఛాన్స్ నాకు దక్కింది. సౌత్ ఇండియన్ అన్ని భాషల్లో రీమేక్ చేసాను, అది కూడా నా డైరెక్షన్ లో ఉంటుందని’ త్యాగరాజన్ తెలిపాడు. అయితే కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి అందుతున్న సమాచారం మేరకు ఈ ఈ స్పెషల్ 26 రిమేక్ లో తెలుగు వెర్షన్ కి సంబంధించిన దానిలో అక్షయ్ కుమార్ పాత్రలో మంచు విష్ణు నటించే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే అనుపన్ ఖేర్ పాత్రలో అన్ని లాంగ్వేజ్ లోనూ ప్రకాష్ రాజ్ నటించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన అఫిషియల్ అనౌన్స్ మెంట్ త్వరలోనే బయటకు రానుందని ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి వినిపిస్తున్న టాక్. ఇటీవలే త్యాగరాజన్ ‘క్వీన్’ రీమేక్ రైట్స్ ని కూడా సొంతం చేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: